Wednesday, October 30, 2024
HomeతెలంగాణNarayanapeta: ప్రజా సమస్యలపై పోరాడడమే బిఆర్ఎస్ లక్ష్యం

Narayanapeta: ప్రజా సమస్యలపై పోరాడడమే బిఆర్ఎస్ లక్ష్యం

సంబరాల్లో..

విద్యుత్తు చార్జీలు పెంచుతామన్న కాంగ్రెస్ ప్రభుత్వం మెడలు వంచి అడ్డుకున్నామని బిఆర్ఎస్ నాయకులు అన్నారు. బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్,జిల్లా అధ్యక్షులు మాజీ శాసనసభ్యులు ఎస్ రాజేందర్ రెడ్డి ఆదేశానుసారం మేరకు బుధవారం జిల్లా వ్యాప్తంగా బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పై విజయం సాధించినందుకు సంబరాలను జరుపుకున్నారు.

- Advertisement -

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేదలపై కాంగ్రెస్ ప్రభుత్వం విద్యుత్ చార్జీలు పెంచేందుకు చేసిన కుట్రను బిఆర్ఎస్ పార్టీ అడ్డుకుందన్నారు. భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ తీసుకువచ్చే ప్రజా వ్యతిరేక విధానాలను అడ్డుకొని తీరతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సవాల్ చేశారు.

ఈ కార్యక్రమంలో మరికల్ మండల అధ్యక్షులు లంబాడి తిరుపతయ్య, వై కృష్ణారెడ్డి, బసంత్, చంద్రశేఖర్, సుధాకర్ గౌడ్, రవి, రాజేంద్ర గౌడ్, సునీల్ కుమార్ రెడ్డి, సుధీర్ కుమార్, గండి బాలరాజ్, మురళీధర్ రెడ్డి, గౌని శ్రీనివాస్, శివారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News