గత రెండు రోజులుగా చర్చ జరుగుతున్న పదవ తరగతి పరీక్షల పేపర్ లీకేజ్ ఉదంతంపై BRS నేత, ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి మండిపడ్డారు. పేపర్ లీకేజ్ కి పాల్పడి ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయాలనే దురుద్దేశ్యంతో యువతను ఇలాంటి చర్యలకు ఉసిగొల్పినట్టు, పోలీస్ విచారణలో సాక్షాధారాలతో బయటపడిన దొంగ కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ అంటూ ఆయన దుయ్యబట్టారు. బండి చర్యలను ప్రశ్నిస్తూ, బీజేపీ వైఖరికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పట్టణ కమిటీకి పిలుపునిచ్చారు ఎమ్మెల్యే పెద్ది.
ఎమ్మెల్యే గారి పిలుపు మేరకు, లీకేజీ నేరానికి పాల్పడిన కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ దిష్టిబొమ్మ దగ్ధంచేసి, ఎం.పీ పదవి నుండి వెంటనే భర్తరఫ్ చేసి, అతనిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసిన నర్సంపేట పట్టణ బి.ఆర్.ఎస్ పార్టీ.
తెలంగాణ సమాజంలో అలజడి సృష్టించి, విద్యార్థుల తల్లిదండ్రులు భయాందోళనకు గురయ్యే విధంగా పేపర్ లీకేజ్ కొరకు యువతను ప్రోత్సహించిన బండి సంజయ్ ను, బీజేపీని తెలంగాణ ప్రజలు ఈ ప్రాంతం నుండి బహిష్కరించాలని కోరారు. పేపర్ లీకేజ్ కు పాల్పడిన వ్యక్తి బండి సంజయ్ తో పాటు బీజేపీ ముఖ్య నాయకుల అందరితో కలిసి దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతున్న వాటినే సాక్ష్యంగా.. బిజెపికి అతనికి ఉన్న సాన్నిహిత్యంతోనే ఉద్దేశ్య పూర్వకంగా వాళ్లు కావాలనే ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయాలనే ఇలాంటి చర్యలకు పాల్పడినట్టు తెలిపారు.
పోలీసు వారి పర్యవేక్షణలో అన్ని రూల్స్ పాటిస్తూ, సిస్టమ్యాటిక్ గా నిర్వహిస్తున్న పరీక్ష కేంద్రంలోకి ఆ సదరు బిజెపికి చెందిన వ్యక్తి గోడ దూకి మరీ అక్రమంగా పరీక్ష కేంద్ర0లోకి చొరబడాల్సిన అవసరం ఏముంది…? పరీక్ష పేపర్ ని ఫోటో తీసుకొని ఆ ఫోటోను వెంటనే బండి సంజయ్ కి పంపాల్సిన అవసరం ఏముందంటూ ఆయన ప్రశ్నల వర్షం కురిపించారు. వేరే వేరే జిల్లాల్లో పరీక్ష పేపర్లు లీకైనట్టు వస్తున్న ఉదంతాల్లో కూడా ఖచ్చితంగా బీజేపీ పాత్ర దాగి
ఈ కార్యక్రమంలో పట్టణ పార్టీ అధ్యక్షులు మరియు నర్సంపేట రూరల్ మండలాధ్యక్షులు ఎంపీపీ మరియు జడ్పిటిసి గార్లు, మున్సిపల్ చైర్ పర్సన్, వైస్ చైర్మన్, క్లస్టర్స్, ముఖ్య నాయకులు, పార్టీ అనుబంధ సంఘాల బాధ్యులు, కార్యకర్తలు పాల్గొన్నారు.