దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న ఇందూరు పసుపు రైతుల కల సంక్రాంతి పండుగ వేళ సాకారం అయింది. నిజామాబాద్‌లో జాతీయ పసుపు బోర్డు(National Turmeric Board)ను కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎంపీ అర్వింద్ కుమార్ పాల్గొన్నారు.
- Advertisement -
కాగా పసుపు బోర్డును ఏర్పాటు చేయనున్నట్లు అసెంబ్లీ ఎన్నికల ప్రచారం సందర్భంగా 2023 అక్టోబరు 1న మహబూబ్‌నగర్ సభలో ప్రధాని మోదీ(PM Modi) ప్రకటించారు. అనంతరం అక్టోబరు 4న కేంద్ర వాణిజ్యశాఖ దీనిపై గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. తాజాగా నిజామాబాద్‌లో బోర్డు ఏర్పాటు చేస్తున్నట్లు సోమవారం ప్రకటించింది. ఈ బోర్డుకు ఛైర్మన్‌గా బీజేపీ నాయకుడు పల్లె గంగారెడ్డిని నియమించింది.