Saturday, November 15, 2025
HomeతెలంగాణNaveen yadav: జూబ్లీహిల్స్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి ఖరారు.. నవీన్‌ యాదవ్‌కే టికెట్‌ కన్ఫర్మ్‌

Naveen yadav: జూబ్లీహిల్స్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి ఖరారు.. నవీన్‌ యాదవ్‌కే టికెట్‌ కన్ఫర్మ్‌

Naveen yadav as Jubilee hills congress candidate: జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నిక కాంగ్రెస్ అభ్యర్థిగా నవీన్ యాదవ్ ను ఆ పార్టీ హైకమాండ్ ఖరారు చేసింది. ఈ మేరకు పార్టీ ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ అధికారిక ప్రకటన విడుదల చేశారు. నవంబరు 11న జూబ్లీహిల్స్‌ అసెంబ్లీ స్థానానికి ఉపఎన్నిక జరగనుంది. గత ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితి తరఫున పోటీ చేసి గెలిచిన మాగంటి గోపీనాథ్‌ (62) మృతితో ఈ ఎన్నిక అనివార్యమైంది. నవీన్‌ యాదవ్‌ ఆ ఎన్నికల్లో ఎంఐఎం తరఫున పోటీ చేసి ఓడిపోయారు. అనంతరం కాంగ్రెస్‌లో చేరి, తాజాగా టికెట్‌ దక్కించుకున్నారు.

- Advertisement -

IMG-20251008-WA0017

జూబ్లీహిల్స్‌లో మాస్‌ ఫాలోయింగ్‌..

కాగా, జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికకు అభ్యర్థిని ఎంపిక చేయడానికి తొలుత నలుగురి పేర్లను ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ(పీసీసీ) ప్రతిపాదించింది. సీఎం సూచనలతో నవీన్‌యాదవ్, మాజీ ఎంపీ అంజన్‌కుమార్‌ యాదవ్, మాజీ మేయర్‌ బొంతు రామ్మోహన్, కార్పొరేటర్‌ సీఎన్‌ రెడ్డిల పేర్లను పీసీసీ సోమవారం ఏఐసీసీకి పంపింది. సామాజిక సమీకరణలు, సర్వేల ఆధారంగా ఎట్టకేలకు నవీన్‌ యాదవ్‌కు అవకాశం దక్కింది. బీసీలకు రిజర్వేషన్లను 42 శాతానికి పెంచుతూ జీఓ ఇచ్చినందున జూబ్లీహిల్స్‌ టికెట్‌ను కూడా అదే సామాజికవర్గానికి ఇవ్వాలని ఏఐసీసీని రాష్ట్ర కాంగ్రెస్‌ నేతలు కోరుతూ వచ్చారు. ఈ నేపథ్యంలోనే గ్రేటర్‌ హైదరాబాద్‌లో బలమైన బీసీ యాదవ సామాజికవర్గానికి చెందిన యువనేత నవీన్‌ యాదవ్‌ను ఎంపిక చేసినట్లు సమాచారం. కాగా, నవీన్‌యాదవ్‌కు జూబ్లీహిల్స్‌ బస్తీల్లో మంచి మాస్‌ ఫాలోయింగ్ ఉంది. ఆయన 2014 అసెంబ్లీ ఎన్నికల్లో జూబ్లీహిల్స్‌ ఎంఐఎం అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయారు. అయినప్పటికీ, మంచి ఓట్లు సాధించి రెండో స్థానంలో నిలిచారు. ఆర్థిక అండదండలతో పాటు ఆయనకు ఓటర్లతో పరిచయాలున్నాయి.

  • Beta

Beta feature

  • Beta

Beta feature

  • Beta

Beta feature

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad