జి. ఒ.యం.ఎస్.నెంబర్ 58, 59 ద్వారా వచ్చిన దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని సి.ఎల్. ఎ ప్రధాన కమిషనర్ నవీన్ మిట్టల్ అన్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్లతో సమీక్ష నిర్వహించారు. జి. ఒ 58, 59, 76 ద్వారా వచ్చిన దరఖాస్తులు, వాటి పరిష్కారం, ధరణిలో ఉన్న పెండింగ్ కేసులు, ఇబ్బందులు, కొత్తగా వచ్చిన అప్లికేషన్ ల పై చర్చించి పలు సూచనలు చేశారు. జి. ఒ 58, 59 ద్వారా వచ్చిన దరఖాస్తులలో ఒక లక్ష రూపాయల లోపు, పది లక్షల రూపాయలకు పైన వసూలు చేయాల్సి ఉన్న వాటిపై ప్రత్యేకంగా చర్చించారు.
వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ మాట్లాడుతూ వనపర్తి జిల్లాలో ధరణి పోర్టల్ లో పరిష్కరించాల్సిన ఫిర్యాదులు కేవలం 2528 మాత్రమే ఉన్నాయని, వాటిని సైతం సకాలంలో పరిష్కరించడం జరుగుతుందని తెలిపారు. ధరణి లో కొత్తగా ప్రవేశపెట్టిన మొడ్యుల్ వల్ల చాలా సమస్యలు పరిష్కరించేందుకు వెసులుబాటు దొరికిందని తెలిపారు. లక్ష రూపాయల లోపు, 10 లక్షల రూపాయలు పైన వసూలు చేయాల్సిన జి. ఒ 58, 59 దరఖాస్తులు వనపర్తి జిల్లాలో పెండింగ్ లో లేవని తెలిపారు.
స్పందించిన ప్రధాన కమిషనర్ మిస్సింగ్ సర్వేలు పరిష్కరించేందుకు కలెక్టర్లకు అధికారం ఇవ్వడం జరిగింది కాబట్టి అలాంటి సమస్యలు ఉంటే త్వరగా పరిష్కరించాలన్నారు. మ్యుటేషన్ లు, సక్సేశన్ లు ధరణి ద్వారా వచ్చే ఫిర్యాదులు ఎప్పటికప్పుడు పరిష్కరించాలని తెలిపారు. అదనపు కలెక్టర్ డి. వేణుగోపాల్, సెక్షన్ సుపరిండెంట్ లు తదితరులు పాల్గొన్నారు.
Navin Mittal: నేను అడిగిన వెంటనే పరిష్కరించాలి
ధరణి ద్వారా వచ్చే ఫిర్యాదులు ఎప్పటికప్పుడు పరిష్కరించండి