నేరేడుచర్ల పట్టణంతో పాటు గ్రామాల పరిధిలో బిఆర్ఎస్ జెండా పండుగ వేడుకలు ఘనంగా జరిగాయి. నేపథ్యంలో నేరేడుచర్ల బి ఆర్ ఎస్ పట్టణ కార్యాలయంలో, ప్రధాన రహదారి వెంట ఏర్పాటు చేసిన టిఆర్ఎస్ స్తూపం వద్ద నేరేడుచర్ల బిఆర్ఎస్ పట్టణ అధ్యక్షురాలు/మున్సిపల్ వైస్ చైర్మన్ చల్లా శ్రీలతా రెడ్డి జెండా ఆవిష్కరించారు. అంతకుముందు మున్సిపాలిటీ పరిధిలోని 15 వార్డులలో వార్డు అధ్యక్షులు బిఆర్ఎస్ జెండా ఎగరవేశారు. ఈ సందర్భంగా బిఆర్ఎస్ పట్టణ అధ్యక్షురాలు పలు వార్డుల్లో జెండా ఆవిష్కరన కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం చల్ల శ్రీలతా రెడ్డి మాట్లాడుతూ బిఆర్ఎస్ రాష్ట్ర మంత్రి కేటీఆర్ ఆదేశానుసారం, హుజూర్నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి పిలుపుమేరకు ప్రతి వార్డుల్లో జెండా పండుగను జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు.
రాష్ట్రంలో బిఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలందరికీ అండగా ఉంటుందని చెప్పారు. ముఖ్యంగా మహిళల కోసం ప్రభుత్వం షీ టీమ్స్, ఆరోగ్య మహిళ, డ్వాక్రా మహిళ, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, ఇలా మరెన్నో సంక్షేమ పథకాలు చేపట్టిందని తెలిపారు. అనంతరం హుజూర్నగర్ లో జరిగే బిఆర్ఎస్ ప్రజా ప్రతినిధుల సభకు నేరేడుచర్ల నుండి భారీ ఎత్తున బిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు తరలి వెళ్తున్నామని చెప్పారు,ఈ కార్యక్రమాలలో బిఆర్ఎస్ పార్టీ ప్రజా ప్రతినిధులు, వార్డుల అధ్యక్ష, కార్యదర్శులు, పార్టీ సీనియర్ నాయకులు, పార్టీ కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.