Sunday, July 7, 2024
HomeతెలంగాణNeredcharla: మేలో మాత్రమే పూసే 'మే పూలు'

Neredcharla: మేలో మాత్రమే పూసే ‘మే పూలు’

అంజలి స్కూల్ లో మెరిసిన అరుదైన మే పుష్పం

నేరేడు చర్ల మండల కేంద్రంలోని అంజలి స్కూల్ లో ఈరోజు మే పుష్పం మొక్క కనిపించింది. ఏడాదంతా ఈ పూలు కనిపించవు. సంవత్సరంలో ఒక్కసారి పూచే ఈ పూల కోసం అందరూ వేచి చూస్తూ ఉంటారు. చక్కటి వర్ణం, ఆకారంతో ఆకట్టుకుంటున్నాయి.

- Advertisement -

ప్రతి ఏటా మే నెలలో పూచే ఈ పూలను మే ఫ్లవర్స్ అని పిలుస్తారు. గుబురుగా, బంతి ఆకారంలో ఎర్రటి వర్ణంతో అందరినీ ఆకర్షిస్తున్నాయి బంతి, చామంతి, గులాబి, కనకాంబరం, లిల్లి ఇలా ఎన్నో పూలు పెరట్లో పూచినా మే నెలలో పూచే ఈ అరుదైన పుష్పాలు ఉంటే మాత్రం ఆ అందమే వేరు.

ఇవి ఆఫ్రికా, సౌదీ అరేబియా, ఆంధ్ర ప్రాంతాల్లో కనిపిస్తుంటాయి. బ్లడ్ లిల్లీ, బాల్ లిల్లీ, ఫైర్ బాల్ లిల్లీ అనే పేర్లతో కూడా ఈ పూలను పిలుస్తుంటారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News