Sunday, September 8, 2024
HomeతెలంగాణNew batch in VVISM: విశ్వ విశ్వాని సంస్థలో పీజీడీఎం కొత్త బ్యాచ్ ప్రారంభం

New batch in VVISM: విశ్వ విశ్వాని సంస్థలో పీజీడీఎం కొత్త బ్యాచ్ ప్రారంభం

బిజినెస్ వల్డ్ లో బలమైన లీడర్లను తీర్చిదిద్దే..

విశ్వ విశ్వాని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సిస్టమ్స్ అండ్ మేనేజ్‌మెంట్ (వీవీఐఎస్ఎం) లో భవిష్యత్ నేతలను ఆద్యంతం ఉత్సాహపరిచేలా పీజీడీఎం కొత్త బ్యాచ్ 2024-2026 ప్రారంభోత్సవ కార్యక్రమం సాగింది.

- Advertisement -

విశ్వ విశ్వాని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సిస్టమ్స్ అండ్ మేనేజ్‌మెంట్(వీవీఐఎస్ఎం) ప్రఖ్యాత కార్యక్రమం “వారధి” – పీజీడీఎం బ్యాచ్ 2024-2026 ప్రారంభోత్సవ వేడుక విజయవంతంగా ముగిసింది. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, అధ్యాపకులు, పరిశ్రమ నేతలు, పూర్వ విద్యార్థులు వంటి ప్రేరణాత్మక సమూహం సమక్షంలో జరిగింది.

ఈ కార్యక్రమంలో వక్తలు నూతన పీజీడీఎం విద్యార్థులతో విలువైన జ్ఞానాన్ని పంచుకున్నారు. బిజినెస్ స్టాండర్డ్ సీఓఓ సచిన్ ఫన్సికర్, విద్య నేర్చుకోవడం, ఆర్థిక సమగ్రత, సంస్థలలో అనుకూలత ప్రాముఖ్యతను హైలైట్ చేశారు. అపోలో హెల్త్ అండ్ లైఫ్ స్టైల్ లిమిటెడ్‌లో లెర్నింగ్ అండ్ ఆర్గనైజేషనల్ డెవలప్‌మెంట్ హెడ్ ఎల్టన్ నాథన్, నాయకుల రూపకల్పనలో అభిప్రాయం, వినయము, సహనము ప్రాముఖ్యతను వివరించారు.

వీవీఐఎస్ఎం గ్రూప్ ప్రెసిడెంట్ జీఎస్ఎస్ వెంకటేశ్వర్ రావు ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ, పరిశ్రమకు సిద్ధంగా ఉన్న వృత్తిపరులను తయారు చేయడంలో ఇన్స్టిట్యూట్ చిత్తశుద్ధిని వివరించారు. ప్రత్యేక జ్ఞానం, ముఖ్యమైన నైపుణ్యాలను మెరుగుపరచడం, బలమైన కమ్యూనికేషన్ సామర్థ్యాలను అభివృద్ధి చేయడం, విలువైన సర్టిఫికేషన్లను పొందడం మీద వీవీఐఎస్ఎం ప్రత్యేకతలు వివరించారు. అలాగే సమాజంపై సానుకూల ప్రభావం చూపగల సమగ్ర వ్యక్తులను పోషించడంలో ఇన్స్టిట్యూట్ పాత్రను కూడా ప్రస్తావించారు.

డైరెక్టర్ పీజీడీఎం డాక్టర్ వై లక్ష్మణ్ కుమార్, అసోసియేట్ డీన్ జయశ్రీ వీ, ప్రోగ్రాం నిర్మాణం, అధ్యాపకుల నైపుణ్యం, సమగ్ర అభివృద్ధి పట్ల ఇన్స్టిట్యూట్ కట్టుబాటు వివరించారు.

జేపీ మోర్గాన్ చేస్ అండ్ కో నుండి ప్రేమ్, అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్ పూర్వ విద్యార్థి, కెరీర్ ప్రోగ్రెషన్, అదనపు ఎలెక్టివ్స్ ప్రాముఖ్యత, బలమైన వృత్తిపర నెట్‌వర్క్ నిర్మాణం మీద ప్రాక్టికల్ ఇన్‌సైట్స్ పంచుకున్నారు.

ఈ ప్రారంభోత్సవ వేడుక పీజీడీఎం విద్యార్థులకు ఒక ఉల్లాసభరిత అకాడెమిక్ ప్రయాణం ఆరంభం గుర్తుగా నిలిచింది. వీవీఐఎస్ఎం నూతన బ్యాచ్ పరిశ్రమలో, నైతిక నాయకులుగా, వ్యాపార ప్రపంచానికి విశేషంగా సహకరించగల సత్తా ఉన్నవారిగా రూపాంతరం చెందుతారని విశ్వాసం వ్యక్తం చేసారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News