గ్రామాల్లో అర్హులైన ప్రతి ఒక్కరిని తప్పనిసరిగా ఓటరు జాబితాలో పేరు నమోదు చేసుకునేలా బూత్ అధ్యక్షులు గ్రామ శాఖ అధ్యక్షులు ఎన్ రోలర్స్ కృషి చేయాలని కాంగ్రెస్ పార్టీ గార్ల మండల అధ్యక్షులు ధనియాకుల రామారావు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న స్థానిక సంస్థల ఎన్నికలు పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో బూత్ అధ్యక్షులు గ్రామ శాఖ అధ్యక్షులు ఎన్ రోలర్స్ గ్రామంలో 18 సంవత్సరాలు నిండిన అర్హులైన ప్రతి ఒక్కరిని తప్పనిసరిగా ఓటర్ జాబితాలో పేరు నమోదు చేసుకునే విధంగా కృషి చేయాలని ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటరు ప్రాముఖ్యత గురించి వారికి వివరిస్తూ కొత్త ఓటర్లకు ప్రేరణ కలిగించాలన్నారు.