Friday, December 12, 2025
HomeTop StoriesRiyaz NHRC: రంగంలోకి NHRC.. రియాజ్‌ ఎన్‌కౌంటర్‌పై నివేదిక ఇవ్వాలని డీజీపీకి ఆదేశాలు

Riyaz NHRC: రంగంలోకి NHRC.. రియాజ్‌ ఎన్‌కౌంటర్‌పై నివేదిక ఇవ్వాలని డీజీపీకి ఆదేశాలు

Riyaz Encounter NHRC Suo Motu: నిజామాబాద్ కానిస్టేబుల్ హత్య కేసులో నిందితుడు రియాజ్‌ను పోలీసులు ఎన్‌కౌంటర్‌ చేసిన విషయం తెలిసిందే. ఈ సంఘటన గురించి వార్తాపత్రికల్లో వచ్చిన కథనాలను మానవ హక్కుల కమిషన్(SHRC) పరిగణనలోకి తీసుకుంది. ఈ ఎన్‌కౌంటర్‌ను రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ సుమోటోగా స్వీకరించింది. ఈ మేరకు ఎన్‌కౌంటర్‌కు సంబంధించి పూర్తి నివేదికను సమర్పించాలని డీజీపీకీ ఆదేశాలు జారీ చేసింది.

- Advertisement -

Also Read: https://teluguprabha.net/telangana-news/dgp-shivadhar-reddy-comments-on-riyaz-encounter-nizamabad/

నిజామాబాద్‌లో అక్టోబర్‌ 17న కానిస్టేబుల్‌ ప్రమోద్‌ను రౌడీషీటర్‌ రియాజ్‌ హత్య చేసిన విషయం తెలిసిందే. పలు కేసుల్లో నిందితుడిగా ఉన్న రియాజ్‌ను అరెస్ట్ చేసి స్టేషన్‌కు తీసుకెళ్తుండగా.. అతడు కానిస్టేబుల్‌పై దాడి చేసి హత్య చేశాడు. దీంతో పోలీసులు రియాజ్‌ను అరెస్ట్‌ చేశారు. కాగా అరెస్టయి 24 గంటలు కాక ముందే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రియాజ్‌ ఎన్‌కౌంటర్‌లో హతమయ్యాడు. ఈ ఘటన కలకలం సృష్టించడంతో ఎన్‌కౌంటర్‌పై స్పందించిన డీజీపీ శివధర్‌ రెడ్డి కీలక ప్రకటన చేశారు. 

నిందితుడు రియాజ్‌ రియాజ్ సాయుధ రిజర్వ్ కానిస్టేబుల్ సర్వీస్ ఆయుధాన్ని లాక్కుని పారిపోవడానికి ప్రయత్నించాడని డీజీపీ చెప్పారు. దీంతో పోలీసులు ఆత్మరక్షణ కోసం కాల్పులు జరిపారని, ఫలితంగా అతను మరణించాడని వివరించారు. ఆత్మరక్షణ కోసం జరిగిన కాల్పుల్లో నిందితుడు రియాజ్ మృతి చెందినట్లు ప్రకటించారు.

Also Read: https://teluguprabha.net/viral/irctc-action-after-viral-video-on-reused-food-containers/

రియాజ్ ఎన్‌కౌంటర్‌ను సుమోటోగా తీసుకున్న ఎస్‌హెచ్‌ఆర్‌సీ.. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 కింద జీవించే హక్కుకు సంబంధించిన ముఖ్యమైన ప్రశ్నలను లేవనెత్తుతుందని తెలిపింది. నవంబర్ 24 లోగా ఈ సంఘటనకు దారి తీసిన పరిస్థితులను, కేసుకు సంబంధించిన ఎఫ్ఐఆర్, పోస్టుమార్టం నివేదికను అందజేయాలని డీజీపీని మానవ హక్కుల కమిషన్‌ ఆదేశించింది.

 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News