Friday, November 22, 2024
HomeతెలంగాణVanaparthi: బిఆర్ఎస్ వెంటే ప్రజలంతా

Vanaparthi: బిఆర్ఎస్ వెంటే ప్రజలంతా

70 మంది కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ లోకి..

పని చేసే నాయకుడి, బిఆర్ఎస్ ప్రభుత్వం వెంట ప్రజలంతా ఎప్పటికి ఉంటారని అందుకు నిత్యం పార్టీలో చేరుతున్న చేరికలు అందుకు నిదర్శనం అని మంత్రి, బిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. వనపర్తి మండలం రాజాపేట గ్రామం లో మాజీ సింగిల్ విండో చైర్మన్ రాజనగరం రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ఎం నాగిరెడ్డి ఎం సత్యనారాయణ రెడ్డి ఏం రాజ మహేందర్ రెడ్డి ఎం శ్రీకాంత్ రెడ్డి రాములు.

- Advertisement -

వీరితోపాటు కాఫీ తాండ నుంచి 34 మంది మరియు రాజపేట గ్రామంలో 30 మంది రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి, బిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి బిఆర్ఎస్ పార్టీ లో పార్టీలో చేరారు. గడిచిన 5 ఏండ్ల కాలంలో భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని వేగవంతంగా పనులు చేసి మీ కండ్ల ముందు పెట్టాను ఇక మీ వంతు మీరు ఎంత మెజారిటీ ఇచ్చి గెలిపిస్తారో అంతే వేగంగా పనులు చేయడం నా వంతు అని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏసురెడ్డి సీనియర్ నాయకులు ఎం సుదర్శన్ రెడ్డి ఎం లోకారెడ్డి గొడుగు ఎల్లయ్య గొడుగు పెంటయ్య తప్ప అశోక్ సంపత్ కుమార్ రెడ్డి సుధాకర్ గౌడ్, సతీష్ శిలా రెడ్డి కొట్టం శ్రీనివాస్ రెడ్డి మరియు రాజపేట గ్రామ ఉపసర్పంచ్ సెవ్య నాయక్, ఠాకూర్ నాయక్, పప్పి తాండ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.


ఈ కార్యక్రమానికి మండలం నుంచి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి వారు వెంటేపల్లి పురుషోత్తం రెడ్డి జిల్లా పార్టీ శిక్షణ తరగతుల కన్వీనర్, జిల్లా గొర్రెల కాపరుల సంఘం అధ్యక్షులు పెండ్యం కురుమూర్తి యాదవ్ జి రాములయ్య వనపర్తి రవి ప్రకాష్ రెడ్డి మహేశ్వర్ రెడ్డి సవాయిగూడెం వీరంతా పాల్గొనడం జరిగింది. మండల రైతు సమన్వయ సమితి అధ్యక్షులు దేవర్ల నరసింహ, సింగల్ విండో అధ్యక్షులు రఘు వర్ధన్ రెడ్డి, మండల యువజన సంఘం అధ్యక్షులు చిట్యాల రాము పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News