వానాకాలానికి అవసరమైన ఎరువులు అందుబాటులో ఉంచాలని మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. జిల్లాల వారీ అవసరాన్ని బట్టి ఎరువుల పంపిణీ ఉండాలని, రైతువేదికలలో నిరంతర సమావేశాల ద్వారా వ్యవసాయ విస్తరణలో రైతులను విరివిగా భాగస్వామ్యం చేయాలని, నకిలీ విత్తన పంపిణీ దారులపై కఠినచర్యలు తీసుకోవాలని సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీచేశారు.
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయంలోని వ్యవసాయ శాఖ మంత్రిత్వ కార్యాలయం సమావేశ మందిరంలో నిర్వహించిన సమీక్షలో రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, హాజరైన రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షులు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు, వివిధ కార్పోరేషన్ల చైర్మన్లు కొండబాల కోటేశ్వర్ రావు, మార గంగారెడ్డి, కొండూరు రవీందర్ రావు, సాయిచంద్, తిప్పన విజయసింహారెడ్డి, మచ్చా శ్రీనివాస్ రావు, రాజావరప్రసాద్ రావు, రామకృష్ణారెడ్డి, ఉద్యానశాఖ డైరెక్టర్ హన్మంతరావు, వ్యవసాయ శాఖ ప్రత్యేక కమీషనర్ హన్మంత్ కొండిబ, వీసీ నీరజా ప్రభాకర్, మార్కెటింగ్ డైరెక్టర్ లక్ష్మీబాయి,,రిజిస్ట్రార్ సుధీర్ కుమార్, ఎండీలు కేశవులు, యాదిరెడ్డి, సురేందర్, జితేందర్ రెడ్డి, రాములు, మురళీధర్, అరుణ, జేమ్స్ కల్వల తదితరులు హాజరయ్యారు.