Saturday, October 5, 2024
HomeతెలంగాణNiranjan Reddy: ఉద్యోగులు తమ బాధ్యతను సక్రమంగా నిర్వహించాలి

Niranjan Reddy: ఉద్యోగులు తమ బాధ్యతను సక్రమంగా నిర్వహించాలి

కారుణ్య నియామక పత్రాలు అందచేసిన మంత్రి

కారుణ్య నియామకం పొందిన ఉద్యోగులు తమ బాధ్యతలను సక్రమంగా నెరవేర్చి మంచి పేరు తెచ్చుకోవాలని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి సూచించారు. సర్వీసులో ఉంటూ మరణించిన ఉద్యోగుల వారసులకు ఇచ్చే కారుణ్య నియామకాల కొరకు ఎదురుచూస్తున్న 19 మందికి బుధవారం ఉదయం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంత్రి జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ తో కలిసి నియామక పత్రాలను అందజేశారు.

- Advertisement -

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వనపర్తి జిల్లాలో వివిధ శాఖలకు సంబంధించిన కార్యాలయాల్లో పని చేస్తూ మరణించిన వారికి వారి వారసులకు విద్యార్హతను బట్టి ప్రభుత్వ ఉద్యోగంలో నియామకాలు ఉంటాయని, జిల్లాలో మొత్తం 19 మందికి ఉద్యోగ నియామక ఉత్తర్వులు ఇస్తున్నట్లు తెలిపారు. ఇందులో 11 మందికి రెవెన్యూ శాఖలో, ఎస్సీ కార్పొరేషన్ లో 2, జిల్లా సహకార సంఘం కార్యాలయంలో లో 2, మిగిలినవి ట్రెజరీ, ట్రాన్స్పోర్ట్, వైద్య ఆరోగ్య శాఖ, ఇరిగేషన్ శాఖలకు ఒక్కో పోస్టు చొప్పున కేటాయించారు. కారుణ్య నియామకాలు పొందినవారు నిజాయితీతో పనిచేసి మంచిపేరు తెచ్చుకోవాలని తెలియజేశారు.


అనంతరం జిల్లా పంచాయతీరాజ్ శాఖలో 6 మంది జూనియర్ పంచాయతీ సెక్రెటరీలకు రెగ్యులరైజ్ ఉత్తర్వులను మంత్రి చేతులమీదుగా అందజేశారు. జూనియర్ పంచాయతీ సెక్రటరి లు వారి పనితీరు ప్రామాణికంగా రెగ్యులరైజ్ చేసేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించడం జరిగిందని, వనపర్తి జిల్లాలో ఇప్పటి వరకు 32 మంది జూనియర్ పంచాయతీ సెక్రెటరీలకు రెగ్యులరైజ్ చేశామన్నారు.


ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, అదనపు కలెక్టర్ యస్. తిరుపతి రావు, డి.పి. ఒ సురేష్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News