Tuesday, September 17, 2024
HomeతెలంగాణNirmal: బండి సంజయ్ దిష్టి బొమ్మలను దగ్ధం చేసిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి

Nirmal: బండి సంజయ్ దిష్టి బొమ్మలను దగ్ధం చేసిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి

నిర్మల్ జిల్లా కేంద్రం మంచిర్యాల చౌరస్తా లో బండి సంజయ్ దిష్టి బొమ్మలను దగ్ధం చేసిన కార్యక్రమంలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పాల్గొన్నారు. అంతకుముందు టెన్త్ ప్రశ్నపత్రం లీక్‌ వ్యవహారంపై మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి స్పందించారు. నిర్మల్ జిల్లా కేంద్రంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. పేపర్స్ లీకేజీల వ్యవహారంలో బీజేపీ అసలు రంగు బయట పడిందని, పదవ తరగతి ప్రశ్నపత్రం లీకేజీ నిందితుడితో బండి సంజయ్ సహా బీజేపీ నేతలతో ప్రత్యక్ష సంబంధాలున్నట్టు ఐకే రెడ్డి ఆరోపించారు.

- Advertisement -

కేంద్ర ప్రభుత్వం డైరెక్షన్ లో ఇదంతా జరుగుతున్నట్లు అనుమానాలు కలుగుతున్నాయని, తెలంగాణపై కేంద్రం కక్ష్య గట్టిందని, ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో తెలంగాణలో అలజడి సృష్టించాలని కేంద్రం చూస్తోందంటూ ఐకే రెడ్డి ఆరోపించారు. పథకం ప్రకారమే ప్రశ్నపత్రాలను లీక్ చేస్తున్నారని, దోషులు ఎంతటి వారైనా వదిలిపెట్టమని ఆయన హెచ్చరించారు.

తెలంగాణ రాష్ట్రంపై కక్ష గట్టిన కేంద్రం, తెలంగాణ ప్రభుత్వన్ని బదనాం చేయాలని చూస్తోందని, గతంలో ఎన్నడూ కూడా తెలంగాణలో ఈ విధంగా పేపర్ లీకేజీలు ఘటనలు జరగలేదనే విషయాన్ని ఐకే రెడ్డి నొక్కి చెప్పారు. ఎన్నికల సమయం సమీపిస్తుండటంతో తెలంగాణలో ఏదో ఒక అలజడి సృష్టించి, రాజకీయ లబ్ధి పొందాలని బిజెపి చూస్తోందన్నారు.

మొన్న టీఎస్పీఎస్సీ పేపర్ , నిన్న పదవ తరగతి ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంలో బీజేపీ నేతలు, ఆ పార్టీ సానుభూతిపరుల కుట్ర కోణంపై నిష్పక్షపాత దర్యాఫ్తు కొనసాగుతోందని మంత్రి అన్నారు. దోషులు ఎంతటి వారైనా వదిలే ప్రసక్తే లేదని, బీజేపీ నేతలు తీరును నిరసిస్తూ దిష్టి బొమ్మలను దగ్ధం చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిస్తున్నట్టు ఆయన తెలిపారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News