Saturday, October 5, 2024
HomeతెలంగాణNizamabad: 2.5 కోట్లతో భీంగల్ బస్ డిపో పునర్నిర్మాణం

Nizamabad: 2.5 కోట్లతో భీంగల్ బస్ డిపో పునర్నిర్మాణం

17 ఏళ్లుగా మూసి ఉన్న బస్ డిపో

నిజామాబాద్ జిల్లా భీంగల్ బస్ డిపోను పున: ప్రారంభించేందుకు ఈరోజు రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రివర్యులు వేముల ప్రశాంత్ రెడ్డి, టిఎస్ఆర్టిసి చైర్మన్, నిజామాబాద్ గ్రామీణ నియోజకవర్గ శాసనసభ్యులు బాజిరెడ్డి గోవర్ధన్ భీంగల్ లోని బస్టాండు డిపోను పరిశీలించారు..

- Advertisement -

భీంగల్ పట్టణంలోని టిఎస్ ఆర్టిసి బస్ డిపో, ప్రయాణ ప్రాంగణాలను వేముల ప్రశాంత్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ వీజీ గంగాధర్ గౌడ్ తో కలిసి పరిశీలించిన తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ చైర్మన్ నిజామాబాద్ గ్రామీణ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ బాజిరెడ్డి గోవర్ధన్. బస్ డిపో ప్రారంభానికి కావలసిన ఏర్పాట్లన్నీ నిర్వహిస్తున్నామని వారు చెప్పారు. 2006లో మూసివేసిన టిఎస్ఆర్టిసి బస్ డిపో పూన: ప్రారంభం కోసం టిఎస్ ఆర్టిసి చైర్మన్, శాసనసభ్యులు బాజిరెడ్డి గోవర్ధన్ పునర్నిర్మాణం కొరకు ₹ 2 కోట్ల 50 లక్షల నిధులతో పనులను చేపట్టి అతి త్వరలోనే ప్రజలకు మెరుగైన సౌకర్యాలతో బస్ డిపోను ప్రారంభిస్తామని వెల్లడించారు.

ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ సంస్థలో మొత్తం 49 వేల సిబ్బంది ఉన్నారన్నారు, డ్రైవర్లు కండక్టర్లు డిపో సిబ్బంది ఆఫీసర్లు ఆర్ఎంలు డీఎంలు సంస్థ కోసం నిరంతరం కష్టపడి పని చేస్తున్నారని చెప్పారు. కేసీఆర్ ఆర్టీసీ చైర్మన్ గా నియమించిన తర్వాత, ఆర్టీసీ సంస్థ చాలా నష్టాలు ఉండేవి, సంస్థ కోసం నా చైర్మన్ జీతాన్ని సైతం తీసుకోవడం మానేసాను. ఆర్టీసీని లాభాల్లో కాకుండా, ఇప్పుడిప్పుడే సంస్థ నిలకడగా నడుస్తుంది, కల్వకుంట్ల చంద్రశేఖర రావు సహాయ సహకారాలతో భీంగల్ బస్ డిపోను పునర్నిర్మానం చేసుకోవడానికి 2 ₹ కోట్ల 50 లక్షల రూపాయలు అవసరం కానుంది, టిఎస్ ఆర్టిసి సంస్థ నుండి ఈ యొక్క నిధులను మంజూరు చేసుకోవడం జరుగుతుంది. ప్రయాణికుల కోసం నూతన బస్టాండ్లు, కమర్షియల్ కాంప్లెక్స్లు నిర్మించి మెరుగైన సౌకర్యాలు కల్పిస్తున్నామని చెప్పారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ టిఎస్ఆర్టిసి సంస్థ కోసం అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తున్నారని, పూర్వ వైభవం కోసం ఆయన కృషి చేస్తున్నారని చెప్పారు. భీంగల్ బస్ డిపోపై కొంతమంది స్థానిక రాజకీయ పార్టీలు బస్టాండ్ పై రాజకీయం చేయడం సరికాదు. ప్రతిపక్ష పార్టీలు రూపాయి తెచ్చే ముఖం లేదు కానీ మాటలేమో కోటలు దాటుతున్నాయి. స్థానికంగా ఉన్న ఎంపీ ఏ ఒక్క గ్రామానికి అయినా రూపాయి ఇచ్చిన ముఖం లేదు. నోరు తెరిస్తే అబద్దం, అబద్దపు ప్రచారాలు చేసుకుంటూ కాలం వెళ్ళదీస్తున్నాడు. తెలంగాణ ప్రజలందరూ బిజెపి కాంగ్రెస్ నాయకులకు ప్రజలు తొందరలోనే బుద్ధి చెబుతారు అని అన్నారు.

భీంగల్ ప్రాంత ప్రజలు ఎన్నో ఏళ్లుగా నిరీక్షిస్తున్న తరుణంలో ఈరోజు బస్ డిపోను పరిశీలించడం ప్రజలందరి హృదయాల్లో ఎంతో సంతోషం నెలకొంది. 1994 సంవత్సరంలో ఆనాటి ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర రెడ్డి స్వయంగా వచ్చి భీంగల్ బస్ డిపోను ప్రారంభించారు. కల్వకుంట్ల చంద్రశేఖర రావు సహాయ సహకారాలతో వేముల ప్రశాంత్ రెడ్డి, టిఎస్ఆర్టిసి చైర్మన్ శాసనసభ్యులు బాజిరెడ్డి గోవర్ధన్ ప్రత్యేక చొరవ తీసుకొని పున ప్రారంభించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. భీంగల్ బస్ డిపో ప్రారంభంతో నిజామాబాద్ గ్రామీణ నియోజకవర్గం మరియు బాల్కొండ నియోజకవర్గం ఆర్మూరు నియోజకవర్గ ప్రజలకు రవాణా సౌకర్యం చాలా సులభంగా అవుతుంది.

17 సంవత్సరాల నుండి మూసి ఉన్న బస్ డిపో కోసం కృషి చేస్తున్న మంత్రి ప్రశాంత్ రెడ్డికి ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ కి ప్రజలు శుభాకాంక్షలు తెలియజేశారు. భీంగల్ డిపో పూర్వవైభవం కోసం కృషి చేస్తున్న ప్రశాంత్ రెడ్డికి టిఎస్ఆర్టిసి చైర్మన్ శాసనసభ్యులు బాజిరెడ్డి గోవర్ధన్ కి నిజామాబాద్ జిల్లా ప్రజలు కృతజ్ఞతలు తెలియజేసి బస్ డిపో ప్రారంభంతో ప్రజలందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు..

ఈ కార్యక్రమంలో టిఎస్ఆర్టిసి అధికారులు ఈడిఓ కరీంనగర్ జోన్ వినోద్ కుమార్, ఈడిఓ మునిశేఖర్, నిజామాబాద్ రీజినల్ మేనేజర్ జానీ రెడ్డి, టిఎస్ ఆర్టిసి సిబ్బంది, అధికారులు స్థానిక బిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు..

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News