Saturday, April 5, 2025
HomeతెలంగాణNizamabad: BRS పార్టీ ప్లీనరీకి సర్వం సిద్ధం

Nizamabad: BRS పార్టీ ప్లీనరీకి సర్వం సిద్ధం

రేపు జరగబోయే నిజామాబాద్ గ్రామీణ నియోజకవర్గ BRS పార్టీ ప్లీనరీ ఏర్పాట్లను పరిశీలించారు టిఎస్ఆర్టిసి చైర్మన్, నిజామాబాద్ గ్రామీణ నియోజకవర్గ శాసనసభ్యులు బాజిరెడ్డి గోవర్ధన్. గ్రామ గ్రామాన బిఆర్ఎస్ పార్టీ జెండా ఎగరాలి, ప్రతి కార్యకర్త పార్టీ ప్లీనరీకి తరలి రావాలి అంటూ వీరు నినదించారు. రేపు తేదీ 25. 04. 2023 రోజున ఉదయం 10-00 గంటలకు భూమారెడ్డి కన్వెన్షన్ హాల్ బోర్గాంలో జరగబోయే పార్టీ ప్లీనరీ ఏర్పాట్లను పరిశీలించారు టిఎస్ఆర్టిసి చైర్మన్, శాసనసభ్యులు బాజిరెడ్డి గోవర్ధన్. నిజామాబాద్ జిల్లా పరిషత్ ఆర్థిక మరియు ప్రణాళిక సభ్యులు జెడ్పిటిసి శ్రీ బాజిరెడ్డి జగన్మోహన్ గారితో పార్టీ కార్యకర్తలతో ఏర్పాట్లను ఆయన పరిశీలించారు.

- Advertisement -

నిజామాబాద్ గ్రామీణ నియోజకవర్గంలో చేపట్టిన అనేక సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ఫోటో గ్యాలరీ ద్వారా ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. సభా వేదిక, పార్కింగ్ స్థలం, వంటశాల, కార్యకర్తలతో సమావేశం కానున్న హాళ్లను – గౌరవ టిఎస్ ఆర్టిసి చైర్మన్, శాసనసభ్యులు శ్రీ బాజిరెడ్డి గోవర్ధన్ ప్రత్యేకంగా పరిశీలించారు.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా సంక్షేమ పథకాలు పొందిన ప్రతి ఒక్కరు, అన్ని మండలాల పార్టీ అధ్యక్షులు, ఎంపీపీలు, జెడ్పిటిసిలు, వైస్ ఎంపీపీలు, సర్పంచులు, ఎంపీటీసీలు, ఉప సర్పంచులు, సొసైటీ చైర్మన్లు మరియు డైరెక్టర్లు రైతుబంధు సమితి అధ్యక్షులు మరియు కార్యవర్గ సభ్యులు, పార్టీ ప్రతినిధులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, విభాగాల నాయకులు, అభిమానులు, కార్యకర్తలు, నాయకులు, ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున విచ్చేసి విచ్చేసి విజయవంతం చేయవలసిందిగా విజ్ఞప్తి చేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News