Wednesday, October 30, 2024
HomeతెలంగాణCM KCR: ముందస్తు కాదు.. కానీ దూకుడు పెంచిన గులాబీ బాస్!

CM KCR: ముందస్తు కాదు.. కానీ దూకుడు పెంచిన గులాబీ బాస్!

- Advertisement -

CM KCR: సీఎం కేసీఆర్.. ఈపేరు తెలంగాణ రాజకీయాలలో ఎప్పటికప్పుడు అగ్రెసివ్ గా మారుమ్రోగుతూనే ఉన్న సంగతి తెలిసిందే. ప్రత్యర్ధులు కాస్త దూకుడు పెంచిన ప్రతిసారి టీఆర్ఎస్ ఈసారి కష్టమే అనే మాటలు అక్కడక్కడా వినిపించినా కేసీఆర్ మార్క్ రాజకీయాలతో ఆ మాటలు మూన్నాళ్ల ముచ్చటగానే ఆగిపోతాయి. ప్రత్యర్థుల దూకుడుకి కళ్లెం వేయడమెలానో కేసీఆర్ ఎంత బాగా వంటపట్టించుకున్నారో ఈ మధ్య ఫామ్ హౌస్ లో ఎమ్మెల్యేగా కొనుగోలు వ్యవహారం చూస్తేనే తెలిసిపోతుంది.

ప్రత్యర్థుల అంచనాలను తల్లక్రిందులు చేసేలా కేసీఆర్ యాక్షన్ ప్లాన్ ఉంటుందనడంలో ఇప్పటికే తెలంగాణ రాజకీయాలలో చాలా ఎపిసోడ్స్ చూసేశాం. అలాంటి వాటిలో ఒకటి గతంలో ఎవరూ ఊహించనవి విధంగా ముందస్తు ఎన్నికలకు వెళ్లి విజయకేతనం ఎగురవేయడం. ఆరు నెలల ముందే అసెంబ్లీ రద్దు చేసి ప్రజాక్షేత్రంలోకి వెళ్లిన కేసీఆర్ అంతకి ముందున్న ముందస్తు ఎన్నికలకు వెళ్తే ఓటమి తప్పదనే రికార్డులను చెరిపేశారు.

కాగా ఇప్పుడు మళ్ళీ మరోసారి ముందస్తు ఎన్నికలు వెళ్లనున్నారనే ఊహాగానాలు చాలాకాలంగా వినిపిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈసారి ముందస్తు అవసరం లేదని డిక్లేర్ చేస్తూనే మరోవైపు బీ రెడీ మరో పదినెలలే ఎన్నికలకంటూ క్యాడర్ ను సిద్ధం చేస్తున్నారు. ఈ మధ్యనే కార్యవర్గ భేటీలో కూడా కేసీఆర్ ఇదే విషయాన్ని పార్టీ నేతలకు కూడా అల్టిమేట్ ఇచ్చినట్లు పార్టీ ఇన్నర్ టాక్ వినిపిస్తుంది.

ఈ డిసెంబర్ నుండి పొలిటికల్ యాక్షన్ ను మరో స్టేజి ముందుకు తీసుకెళ్లేందుకు సన్నాహాలు మొదలు పెట్టిన కేసీఆర్ పార్టీ నేతలను ఈ టార్గెట్ కి సన్నద్ధం చేస్తున్నారు. షెడ్యూల్ ప్రకారం వచ్చే ఏడాది డిసెంబర్ లో ఎన్నికలు ఉండడంతో ఈ ఏడాది డిసెంబర్ నుండే ఎన్నికల శంఖారావం మొదలు పెట్టేసి ప్రత్యర్థులకు బిగ్ ఛాలెంజ్ విసిరేందుకు సిద్దమైనట్లు రాజకీయ వర్గాలలో చర్చలు జరుగుతున్నాయి.

డిసెంబర్ నాటికి నేషనల్ పార్టీ బీఆర్ఎస్ కి సంబంధించి అధికారిక అనుమతులు రానుండడంతో ముందుగా తెలంగాణ నుండి ఎన్నికల యాక్షన్ ప్లాన్ మొదలు పెట్టే ఆలోచనలో ఉన్న గులాబీ సేనాపతి.. ముందుగా ఇంట గెలిచేందుకున్న అన్ని అవకాశాలను సంపూర్ణంగా వినియోగించుకునేందుకు లాంగ్ టైమ్ షెడ్యూల్స్ తో సిద్ధపడినట్లు తెలుస్తుంది. మరి ఈ దూకుడును ప్రత్యర్ధులు ఎలా ఓవర్ టేక్ చేస్తారనేది యాక్షన్ మొదలైతే కానీ తెలియదు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News