Saturday, November 23, 2024
HomeతెలంగాణNo discussions: పంచాయతీ కార్యదర్శులను చర్చలకు పిలవలేదు: ఎర్రబెల్లి

No discussions: పంచాయతీ కార్యదర్శులను చర్చలకు పిలవలేదు: ఎర్రబెల్లి

జూనియర్ పంచాయతీ కార్యదర్శులను ప్రభుత్వం చర్చలకు పిలిచింది అని జరుగుతున్న ప్రచారం నిజం కాదని, నిబంధనలు, ఒప్పందాలకు విరుద్ధంగా చేస్తున్న సమ్మె వెంటనే విరమించాలని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రకటన విడుదల చేశారు. జూనియర్ పంచాయతీ కార్యదర్శులను ప్రభుత్వం చర్చలకు పిలవలేదని, ప్రభుత్వం తరపున నేను గానీ, మరెవ్వరు గానీ జూనియర్ పంచాయతీ కార్యదర్శులను చర్చలకు పిలవలేదంటూ ఎర్రబెల్లి క్లారిటీ ఇచ్చారు. అలా ప్రభుత్వం చర్చలకు పిలిచింది అని జరుగుతున్న ప్రచారం అబద్ధమని, అలాంటి ప్రచారాన్ని ఎవ్వరూ నమ్మ వద్దని ఆయన వెల్లడించారు. ఇప్పటికైనా జూనియర్ పంచాయతీ కార్యదర్శులు సమ్మె విరమిస్తే బాగుంటుందని, సీఎం కెసిఆర్ మనసున్న మహారాజని, సీఎంకి జూనియర్ పంచాయతీ కార్యదర్శులపై మంచి అభిప్రాయం ఉందని, ఆ పేరును వారు చెడ గొట్టుకోరాదని ఎర్రబెల్లి హితవు పలికారు.

- Advertisement -

ప్రభుత్వాన్ని శాసించాలని సాహసించడం, నియంత్రించాలని అనుకోవడం తప్పన్న ఆయన, JPS లు సమ్మె విరమిస్తే, సీఎం గారు వారికి తప్పకుండా సాయం చేస్తారన్న నమ్మకం నాకు ఉందన్నారు. జూనియర్ పంచాయతీ కార్యదర్శులు సమ్మె చేయడం నిబంధనలు-చట్ట విరుద్ధమని, జూనియర్ పంచాయతీ కార్యదర్శులు ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందానికి కూడా విరుద్ధమని తెలిపారు. సంఘాలు కట్టబోమని, యూనియన్ లలో చెరబోమని, సమ్మెలు చేయబోమని, ఎలాంటి డిమాండ్ల కు దిగబోమని మీరు ప్రభుత్వానికి బాండ్ రాసి ఇచ్చారన్న విషయాన్ని మంత్రి గుర్తుచేశారు.

మీరు రాసిచ్చిన ఒప్పందాలను మీరే ఉల్లంఘిస్తున్న తీరు బాగా లేదని, పైగా సోషల్ మీడియాలో జరుగుతున్న వెంటనే ప్రచారాన్ని నిలిపివేయాలని ఆయన హెచ్చరించారు. మీరు నాతో ఫోన్ ద్వారా మాట్లాడి, మీ సమస్యలు చెప్పుకున్నారని, మీరు సమ్మె విరమించాలని నేను సూచించానని ఆయన చెప్పుకొచ్చారు. కానీ, ప్రభుత్వం చర్చలకు పిలిచింది అని కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని, అలాంటి ప్రచారాలను ఎవరూ నమ్మవద్దన్నారు. ఇప్పటికైనా మించిపోలేదు. ప్రభుత్వం ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, వెంటనే సమ్మె ను విరమించాలన్నారు. తక్షణం విధుల్లో చేరాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు జూనియర్ పంచాయతీ కార్యదర్శులకు హితవు తో కూడిన సూచన, విజ్ఞప్తి చేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News