Friday, November 22, 2024
HomeతెలంగాణNo entry to water falls: వాటర్ ఫాల్స్, డ్యామ్స్, పర్యాటక ప్రాంతాలకు అనుమతి...

No entry to water falls: వాటర్ ఫాల్స్, డ్యామ్స్, పర్యాటక ప్రాంతాలకు అనుమతి లేదు

ప్రాజెక్టులు, చెరువులు, నాళాలు, వాగులు నిండుగా ఉన్నాయి

గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల వలన ప్రాజెక్ట్ లు, డ్యామ్స్ చెరువులు, నాలలు, వాగులు నిండుగా ఉన్నాయి. ఇలాంటి పర్యాటక ప్రాంతాలకు ప్రజలు ఎవ్వరు కూడా వెళ్ళడానికి అనుమతి లేదు అని కమిషనరేట్ పరిధిలోని ప్రజలు, యువత పోలీస్ వారి సూచనలు పాటిస్తూ, సహకరించగలరు అని రామగుండం పోలీస్ కమిషనర్ రెమా రాజేశ్వరి ఐపిఎస్ ప్రకటనను విడుదల చేశారు. మంచిర్యాల, పెద్దపల్లి జోన్ల పోలీసు యంత్రాంగం నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటుందని తెలియజేసారు. ఎవరైనా ఆపదలో ఉంటే వెంటనే, స్థానిక పోలీస్ అధికారులకు లేదా డయల్ 100కి ఫోన్ చేసి పోలీసు వారి సహాయం పొందగలరని తెలిపారు. ప్రస్తుతం వర్షం కొంచెం తగ్గుముఖం పట్టినప్పటికీ కమిషనరేట్ పరిధిలోని ప్రాజెక్టులు, చెరువులు, నాళాలు, వాగులు నిండుగా ఉన్నాయి మరియు కొన్ని ప్రాంతాలలో కల్వర్టు, చిన్న చిన్న బ్రిడ్జి ల వద్ద నీరు ప్రవహిస్తున్నప్పుడు కొంతమంది పోలీస్ వారి హెచ్చరికలు, సూచనలు చేసిన పట్టించు కోకుండా వాహనాలతో వరద నీటి నుండి దాటడానికి ప్రయత్నం చేస్తున్నారు అట్టి చర్యలు ప్రమాదకరం. నేడు, రేపు రెండు రోజులు సెలవులు కావున చాలా మంది ఇతర ప్రాంతాల నుండి, స్థానిక ప్రజలు, యువత వాటర్ పాల్స్, ప్రాజెక్ట్, పర్యాటక ప్రాంతాలను చూడడానికి వచ్చే అవకాశం ఉంది కావున ముందస్తు ప్రజల భద్రత మరియు ప్రాణా రక్షణను దృష్టిలో పెట్టుకొని ప్రాజెక్ట్, డ్యామ్స్ పరిసరాల వద్దకు మరియు పర్యాటక ప్రాంతాలను తాత్కాలికంగా మూసివేయడం జరిగిందని సాధారణ పరిస్థితి వచ్చే వరకు అక్కడికి ఎవరు ప్రజలు వెళ్లకూడదని ప్రజలు అందరు పోలీస్ వారికి సహకరించగలరు అని సీపీ కోరారు. రామగుండం పోలీస్ కమిషనరేట్ ప్రజలకు ఎలాంటి ప్రమాదం తలెత్తకుండా పోలీస్ శాఖ పరంగా తగిన ఏర్పాట్లతో ముందస్తుగా పకడ్బందీ చర్యలు తీసుకోవడం జరుగుతుంది అని ప్రజలు పోలీసు వారి సూచనలు సలహాలు పాటిస్తూ సహకరించాలన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News