Wednesday, January 1, 2025
HomeతెలంగాణNew year Celebrations: న్యూఇయర్ వేడుకలు.. నాలుగు పబ్‌లకు నో పర్మిషన్

New year Celebrations: న్యూఇయర్ వేడుకలు.. నాలుగు పబ్‌లకు నో పర్మిషన్

న్యూఇయర్ వేడుకలకు(New year Celebrations) తెలంగాణ సిద్ధమవుతోంది. ముఖ్యంగా హైదరాబాద్(Hyderabad) మహానగరం ముస్తాబవుతోంది. కొత్త సంవత్సరం వేడుకల కోసం నగరంలోని పబ్బులు, రెస్టారెంట్లు, రిసార్ట్స్ ప్రత్యేక ఈవెంట్స్ ప్లాన్ చేస్తున్నాయి. మరోవైపు సిటీ పోలీసులు కూడా న్యూఇయర్ వేడుకలపై నిఘా పెట్టారు. ఇందులో భాగంగా కొన్ని పబ్‌లకు అనుమతులు నిరాకరించారు. నగరంలో మొత్తం 36 పబ్బులు ఉండగా.. ఇందులో నాలుగు పబ్బులకు పోలీసులు అనుమతి ఇవ్వలేదు.

- Advertisement -

హార్డ్ కప్, అమ్నేషియా, బ్రాడ్ వే, బేబీలాన్ పబ్స్‌ల్లో వేడుకలకు పర్మిషన్ లేదని తెలిపారు. గతంలో ఆయా పబ్బుల్లో జరిగిన గొడవలు, పోలీసు కేసుల కారణంగా ఆంక్షలు విధిస్తూ అనుమతి ఇవ్వడం లేదని పోలీసులు స్పష్టం చేశారు. అలాగే ప్రతి పబ్బు, రెస్టారెంట్‌లో అర్ధరాత్రి ఒంటి గంటలోగా వేడుకలు ముగించాలని తేల్చిచెప్పారు. మరోవైపు ఇప్పటికే పబ్స్, రెస్టారెంట్లు, రిసార్ట్స్ న్యూఇయర్ వేడుకల ఈవెంట్స్ బుకింగ్స్ ప్రారంభించాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News