పండుగ వాతావరణం లో తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు జరపాలని పిలుపునిచ్చారు చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్. తెలంగాణలో హనుమంతుని గుడి లేని ఊరు లేదు – కేసీఆర్ సంక్షేమ పథకం అందని ఇల్లు లేదన్నారు రవిశంకర్. జిల్లా ప్రజా ప్రతినిధులు అధికారులు క్షేత్రస్థాయిలో సమన్వయంతో తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు విజయవంతం చేయాలని, రాష్ట్రవ్యాప్తంగా విద్య కోసం ప్రభుత్వం చేస్తున్న కృషిని, మన ఊరు మన బడి ద్వార నాడు – నేడు ఫోటోలతో ప్రదర్శించాలన్నారు. మిషన్ కాకతీయ పథకం ద్వారా సాగునీటి చెరువులో పునరుద్ధరణ, చెక్ డ్యాం లు, చెరువులతో భూగర్భ జలాలు పెరిగాయన్నారు. నాడు ఆఖరి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, ప్రత్యేక రాష్ట్రం వస్తే రాష్ట్రం చీకటి అవుతుందని వైర్ల మీద బట్టలు ఎండేసుకోవాలని హేళన చేశారన్నారు. కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 24 గంటల కరెంటు, రైతులకు ఉచిత కరెంటు వచ్చిందన్నారు. తెలంగాణ రాష్ట్రం సాధించిన అనంతరం ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత గత తొమ్మిది సంవత్సరాలుగా సాధించిన ప్రగతిని పల్లెల ప్రజలకు వివరిస్తూ ఘనంగా రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు ఘనంగా నిర్వహించాలన్నారు.
కరీంనగర్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగిన దశాబ్ది ఉత్సవాలు సమీక్షా సమావేశం కార్యక్రమంలో చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ పాల్గొన్నారు.