Konda Surekha: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ (KTR) వేసిన పరువునష్టం దావా కేసులో మంత్రి కొండా సురేఖ(Minister Konda Surekha)కు ప్రజాప్రతినిధుల కోర్టు షాక్ ఇచ్చింది. మంత్రి కొండా సురేఖకు కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. ఇవాళ ఈ కేసుపై సుదీర్ఘంగా విచారణ జరిపిన అనంతరం కోర్టు ఈ వారెంట్‌ను జారీ చేసింది. తదుపరి విచారణను ఫిబ్రవరి 5వ తేదీకి వాయిదా వేసింది.
అసలేం జరిగిందంటే: గతంలో మంత్రి కొండా సురేఖ కేటీఆర్‌పై విమర్శలు చేసే క్రమంలో ప్రముఖ సినీ నటులు నాగచైతన్య, సమంత విడాకులపై చేసిన వ్యాఖ్యలు అప్పట్లో తీవ్ర వివాదాస్పదమయ్యాయి. ఈ వ్యాఖ్యలను అక్కినేని నాగార్జున, కేటీఆర్ ఇద్దరూ తీవ్రంగా తప్పుబట్టారు. దీంతో వీరిద్దరూ కొండా సురేఖపై ప్రత్యేకంగా పరువు నష్టం దావాలు దాఖలు చేశారు.
కొండా సురేఖ పశ్చాత్తాపం: ఇటీవల నాగార్జున కుటుంబంపై చేసిన వ్యాఖ్యల పట్ల మంత్రి కొండా సురేఖ పశ్చాత్తాపం వ్యక్తం చేశారు. ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించారు. దీంతో నాగార్జున తన పిటిషన్‌ను ఉపసంహరించుకున్నారు. అయితే కేటీఆర్ దాఖలు చేసిన కేసుపై మాత్రం కోర్టు విచారణ కొనసాగించింది. తాజాగా ఈ కేసును విచారించిన కోర్టు మంత్రి కొండా సురేఖపై నాన్‌బెయిలబుల్ వారెంట్‌ను జారీ చేసింది.

