Sunday, November 16, 2025
Homeచిత్ర ప్రభBetting Apps: బెట్టింగ్ యాప్స్‌ ప్రమోట్ చేస్తున్న సెలబ్రిటీలకు నోటీసులు

Betting Apps: బెట్టింగ్ యాప్స్‌ ప్రమోట్ చేస్తున్న సెలబ్రిటీలకు నోటీసులు

యువతను బలి తీసుకుంటున్న బెట్టింగ్ యాప్స్‌(Betting Apps)పై పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టారు. ముఖ్యంగా ఈ యాప్స్ ప్రమోట్ చేస్తూ యువతను బెట్టింగ్ ఊబిలోకి లాగుతున్న సోషల్ మీడియా సెలబ్రెటీలపై కేసు నమోదు చేస్తున్నారు. ఇందులో భాగంగా 11 మంది సెలబ్రెటీలపై హైదరాబాద్‌లోని పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు. ఇందులో భాగంగా ఇవాళ విచారణకు హాజరుకావాలని విష్ణుప్రియ, టేస్టీ తేజలకు నోటీలసులు జారీ చేశారు. విచారణకు రాని పక్షంలో వారిని అరెస్ట్ చేసే అవకాశం ఉంది.

- Advertisement -

ఈ కేసులో మరికొందరికి కూడా నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది. వైసీపీ అధికార ప్రతినిధి శ్యామల, హర్షసాయి, సన్నీ యాదవ్, సురేఖవాణి కుమార్తె సుప్రీత, రీతూ చౌదరి, ప్రియాంక జైన్ సహా పలువురిపై కేసు నమోదైంది. ఈ బెట్టింగ్ యాప్స్‌ ఆగడాలపై ముఖ్యంగా ఐపీఎస్ అధికారి వీసీ సజ్జనార్(Sajjanar), ప్రపంచ యాత్రికుడు అన్వేష్ పోరాటం ప్రశంసనీయమైంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad