Saturday, November 15, 2025
Homeచిత్ర ప్రభActor Ali: అక్రమ నిర్మాణాలు.. కమెడియన్‌ అలీకి నోటీసులు

Actor Ali: అక్రమ నిర్మాణాలు.. కమెడియన్‌ అలీకి నోటీసులు

Actor Ali| ప్రముఖ కమెడియన్ అలీకి తెలంగాణ అధికారులు భారీ షాక్ ఇచ్చారు. అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారంటూ నోటీసులు జారీ చేశారు. వికారాబాద్ జిల్లా నవాబుపేట మండల ఎక్మామిడి పంచాయతీ పరధిలో అలీకి ఫాంహౌస్ ఉంది. అయితే అక్కడ తాజాగా అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారని విలేజ్ సెక్రటరీ శోభారాణి ఆయనకు నోటీసులు అందించారు. ఈ నోటీసులపై న్యాయపరంగా అలీ ముందుకెళ్లనున్నట్లు తెలుస్తోంది. కొందరు కావాలనే తనపై కుట్రలు చేస్తున్నారని.. ఇందులో భాగంగానే నోటీసులు పంపించారని ఆరోపిపిస్తున్నట్లు సమాచారం.

- Advertisement -

కాగా సినిమాల్లో కమెడియన్‌గా అలరించిన అలీ రాజకీయాల్లోనూ రాణించాలనే తపనతో వైసీపీలో చేరిన సంగతి తెలిసిందే. ఆ పార్టీ అధినేత జగన్ కోసం ఆయన పనిచేశారు. అయితే గత ఎన్నికల్లో రాజమండ్రి లేదా గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే టికెట్ ఆశించారు. కానీ జగన్ అలీకి మొండిచెయ్యి చూపించారు. వైసీపీలో చేరి తన స్నేహితుడైన జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు కూడా అలీ దూరమయ్యారు. ఈ ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం కావడం.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం కావడంతో అలీ వైసీపీకి రాజీనామా చేసి రాజకీయాలకు గుడ్ బై చెప్పేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad