Saturday, October 19, 2024
HomeతెలంగాణNUDE CALL: తెలంగాణ ఎమ్మెల్యేకు మహిళ న్యూడ్ కాల్..!

NUDE CALL: తెలంగాణ ఎమ్మెల్యేకు మహిళ న్యూడ్ కాల్..!

ప్రస్తుతం డిజిటల్ కాలంలో సైబర్ నేరాలు ఎక్కువైపోతున్నాయి. సైబర్ కేటుగాళ్ల దెబ్బకు సామాన్యుల నుంచి సినీ, క్రీడా, రాజకీయ, వ్యాపార ప్రముఖులు కూడా బెంబేలెత్తిపోతున్నారు. కొంతమంది వారి మాయలో పడి కోట్లు పోగొట్టుకుంటుంటే.. మరికొంతమంది ముందుగానే అలర్ట్ అయి పోలీసులకు ఫిర్యాదుచేస్తున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే తెలంగాణలో చోటుచేసుకుంది. సైబర్ నేరగాళ్లు ఏకంగా ఎమ్మెల్యేనే టార్గెట్ చేశారు.

- Advertisement -

ఉమ్మడి కరీంగనర్ జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యేకు ఈ నెల 14వ తేదీన అర్థరాత్రి వాట్సాప్ కాల్ వచ్చింది. ఆ కాల్ లిఫ్ట్ చేయగానే అవతలి వైపు నుంచి ఓ మహిళ నగ్నంగా కనిపించడంతో ఒక్కసారిగా కంగుతిన్నారు. దీంతో వెంటనే ఆ కాల్ కట్ చేసి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదుచేశారు. కేసు నమోదుచేసుకున్న పోలీసులు దీనిపై ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ వీడియో కాల్ వెనక తన రాజకీయ ప్రత్యర్థుల హస్తం ఉండొచ్చని ఆ ఎమ్మెల్యే అనుమానిస్తున్నట్లు తెలుస్తోంది. దీని వెనక ఎవరున్నా వదిలిపెట్టే ప్రసక్తే లేదని ఆయన హెచ్చరిస్తున్నారు.

ఇటీవల స్మార్ట్ ఫోన్ వినియోగం సర్వసాధారణం కావడంతో సైబర్ నేరాలు కూడా సాధారణమైపోయాయి. వాట్సాప్ కాల్స్, మెసేజ్స్‌తో మోసం చేసి అందినకాడికి దోచుకుంటున్నారు. ఉద్యోగం ఇప్పిస్తామని ఒకరు, మీరు ఫలానా స్కాంలో ఇరుకున్నారని మరొకరు.. బ్యాంకు నుంచి ఫోన్ చేస్తున్నాం ఓటీపీ చెప్పాలని ఇంకొందరు.. మరికొందరైతే ఏకంగా వాట్సాప్ కాల్ చేసి న్యూడ్ వీడియోలు చేస్తూ హడలెత్తిస్తున్నారు. దీంతో అపరిచితుల వ్యక్తుల నుంచి వచ్చిన వీడియో కాల్స్, మెసేజ్స్‌కి సమాధానం ఇవ్వకండి పోలీసులు సూచిస్తున్నారు. సైబర్ నేరాల పట్ల ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలంటున్నారు. ఒకవేళ పొరపాటున సైబర్ నేరగాళ్ల మాయలో పడితే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని హెచ్చరిస్తున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News