Tuesday, September 10, 2024
HomeతెలంగాణNYE: DGP ఆఫీసులో న్యూ ఇయర్ వేడుకలు

NYE: DGP ఆఫీసులో న్యూ ఇయర్ వేడుకలు

నూతన సంవత్సర వేడుకలను పురస్కరించుకొని డీజీపీ కార్యాలయంలో నేడు నిర్వహించిన కార్యక్రమంలో డీజీపీ అంజనీ కుమార్ కేక్ కట్ చేసి అభినందనలు తెలిపారు. డీజీపీ కార్యాలయంలో పోలీస్ అధికారులు, సిబ్బంది ఏర్పాటు చేసిన నూతన సంవత్సర వేడుకలకు డీజీపీగా భద్యతలు స్వీకరించిన అనంతరం మొట్టమొదటి సారిగా అంజనీ కుమార్ హాజరయ్యారు. ఈ సందర్బంగా డీజీపీ మాట్లాడుతూ, రాష్ట్రంలో శాంతి, భద్రతల పరిరక్షణలో సమన్వయంతో పనిచేయాలని అన్నారు. ఈ నూతన సంవత్సర వేడుకల్లో పలువురు సీనియర్ పోలీస్ అధికారులు హాజరయ్యారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News