హైదరాబాద్‌లోని రాజ్‌భవన్‌లో లోకాయుక్త(Lokayukta) , ఉపలోకాయుక్తల(Deputy Lokayukta) ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా జరిగింది. లోకాయుక్తగా జస్టిస్ ఎ.రాజశేఖర్రెడ్డి , ఉపలోకాయుక్తగా బి.ఎస్.జగ్జీవన్ కుమార్ చేత గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి, స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి , పలువురు ప్రముఖులు హాజరయ్యారు. వీరి నియామకం పాలనలో మరింత పారదర్శకత , జవాబుదారీతనాన్ని పెంచుతుందని భావిస్తున్నారు. లోకాయుక్త , ఉపలోకాయుక్తల నియామకంతో ప్రజలు తమ సమస్యలను త్వరగా పరిష్కరించుకోవచ్చు.