కాగా బుధవారం రాత్రి కూకట్‌పల్లి హైదరానగర్‌లో ఉంటున్న కల్లు కాంపౌండ్‌లో కల్తీ కల్లు తాగి 15 మంది అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, వీరేచనాలు, బీపీతో అస్వస్థతకు గురైన వారిని హుటాహుటిన పంజాగుట్ట నిమ్స్, గాంధీ ఆసుప్రతుల్లో చేర్చించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై స్థానికుల సమాచారంతో ఎక్సైజ్ శాఖ అధికారులు కల్తీ కల్లు అమ్మిన మూడు కాంపౌండ్‌లపై కేసు నమోదుచేసి సీజ్ చేశారు. ఇద్దరిని అదుపులోకి తీసుకోగా.. నిర్వాహకులు పరారీలో ఉన్నారు. అస్వస్థతకు గురైనవారిలో నలుగురు మహిళలు కూడా ఉన్నారు. కల్తీ కల్లు అమ్ముతున్నారని అధికారులకు ఎన్ని సార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు.
- Advertisement -
Also Read: సిటీ సివిల్ కోర్టుకి బాంబు బెదిరింపు.. పోలీసుల తనిఖీలు!
సమాచారం అందుకున్న కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ బాధితులను పరామర్శించారు. కల్తీ కల్లు కాంపౌండ్ కాంగ్రెస్ నాయకుడిదేనని మాధవం కృష్ణారావు ఆరోపించారు. బాధితులకు ప్రభుత్వం న్యాయనం చేయాలని డిమాండ్ చేశారు. మరోవైపు ఈ ఘటనపై ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనరస్సింహా ఆరా తీశారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని నిమ్స్ డైరెక్టర్ బీరమ్మను మంత్రి ఆదేశించారు.


