Friday, September 20, 2024
HomeతెలంగాణOnline booking: ప్ర‌యాణికుల‌కు TSRTC ప్ర‌త్యేక డిస్కౌంట్స్

Online booking: ప్ర‌యాణికుల‌కు TSRTC ప్ర‌త్యేక డిస్కౌంట్స్

ప్ర‌యాణికుల‌కు తెలంగాణ రాష్ట్ర రోడ్డు ర‌వాణా సంస్థ శుభ‌వార్త చెప్పింది. ముందుస్తు రిజ‌ర్వేష‌న్ చేసుకునే ప్ర‌యాణికుల‌కు ప్ర‌త్యేక రాయితీల‌ను ప్ర‌క‌టించింది. 31 రోజుల నుంచి 45 రోజుల ముందు రిజ‌ర్వేష‌న్ చేసుకుంటే టికెట్‌లో 5 శాతం రాయితీ క‌ల్పించింది. 46 రోజుల నుంచి 60 రోజుల ముందు టికెట్ బుక్ చేసుకుంటే 10 శాతం డిస్కౌంట్‌ను ప్ర‌క‌టించింది. ఆ మేర‌కు ఆన్‌లైన్ ప్యాసెంజ‌ర్ రిజ‌ర్వేష‌న్ సిస్టం సాప్ట్‌వేర్‌ను అప్‌డేట్ చేసింది. ముంద‌స్తు రిజ‌ర్వేష‌న్ స‌దుపాయం ఉన్న అన్ని స‌ర్వీస్‌ల‌కు ఈ రాయితీ వ‌ర్తిస్తుంద‌ని టీఎస్ఆర్టీసీ స్ప‌ష్టం చేసింది.

సంక్రాంతి పండుగ సంద‌ర్భంగా ముంద‌స్తు రిజ‌ర్వేష‌న్‌ను 30 రోజుల నుంచి 60 రోజులకు సంస్థ పెంచింది. ఈ ఏడాది జూన్ వ‌ర‌కు ఈ సౌక‌ర్యాన్ని క‌ల్పిస్తోంది. ఈ స‌దుపాయానికి ప్ర‌యాణికుల నుంచి మంచి స్పంద‌న వ‌చ్చింది. ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఆన్ లైన్ లో సులువుగా తమ టికెట్లను రిజర్వేషన్ చేసుకున్నారు. ప్రయాణీకులకు మరింత చేరువ అయ్యేందుకు ఈ ప్రత్యేక రాయితీలను టీఎస్ఆర్టీసీ ప్రకటించింది.
టీఎస్ఆర్టీసీ బ‌స్సుల్లో ముంద‌స్తు రిజ‌ర్వేష‌న్ కోసం అధికారిక వెబ్‌సైట్ www.tsrtconline.inను సంద‌ర్శించాలని ఆర్టీసీ ప్రకటనలో పేర్కొంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News