పిసిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఉస్మానియా యూనివర్సిటీకి వస్తే తన్ని, తరిమి కొడతాం అని అంబేడ్కర్ యువజన సంగం అధ్యక్షులు బండారు వీరబాబు హెచ్చరించాడు. సాధారణ ఎన్నికలు సమీపిస్తుండటంతో ఏమీ తోయక, దిక్కుమాలిన రాజకీయాలకు తెరలేపాడని ఆరోపించారు. కొట్లాడి తెచ్చుకొన్న తెలంగాణలో విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఇవ్వాలని ప్రభుత్వము లక్ష ఉద్యోగాలకు ప్రకటనలు ఇచ్చింది. ఇద్దరు వ్యక్తులు చేసిన తప్పిదాలకు ప్రభుత్వానికి ఏమి సంబంధం అని వారు ప్రశ్నించారు. BJPకి B టీంగా రేవంత్ రెడ్డి మారడని, అందుకే కాంగ్రెస్ పార్టీని తెలంగాణలో నమ్మే పరిస్థితి లేదన్నారు వీరబాబు. ఇప్పటికే ప్రభుత్వము నియమించిన సిట్ దర్యాప్తు వేగవంతం చేసి నిందితులను అరెస్ట్ చేసిందని, దాని వెనక ఎవరు ఉన్న వదిలి పెట్టే సమస్య లేదని అన్నారు. అభ్యర్థులు ఆందోళన పడొద్దని ప్రభుత్వము అండగా ఉంటుందని ఆయన అన్నారు.