Outsourcing Panchayat Secretaries Services Extension: తెలంగాణలో అవుట్ సోర్సింగ్ పంచాయతీ కార్యదర్శులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది.1037 మంది అవుట్ సోర్సింగ్ పంచాయతీ కార్యదర్శుల సేవలను మరో ఏడాది పాటు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు అనుమతులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
- Advertisement -
కాంట్రాక్ట్/అవుట్ సోర్సింగ్ నియామకానికి సంబంధించిన పద్ధతులను అనుసరించాలని నెలకు రూ. 19,500 చెల్లించనున్నట్లు ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అదే విధంగా జిల్లాలో పంచాయతీ సెక్రటరీల సంఖ్య గ్రామ పంచాయతీల సంఖ్యను మించకుండా చూసుకోవాలని స్పష్టం చేశారు.
Also Read: https://teluguprabha.net/andhra-pradesh-news/landslides-fall-in-srisailam-pathala-ganga/


