Wednesday, October 2, 2024
HomeతెలంగాణPadi Kaushik: పేదింటి ఆడబిడ్డలకు అండగా రాష్ట్ర ప్రభుత్వం

Padi Kaushik: పేదింటి ఆడబిడ్డలకు అండగా రాష్ట్ర ప్రభుత్వం

100కు పైగా స్థానాల్లో బీఆర్ఎస్ విజయం సాధించటం ఖాయం

పేదింటి ఆడబిడ్డల వివాహ సమయంలో ఆడబిడ్డల తల్లిదండ్రులకు ఆర్థిక ఇబ్బందులు తలెత్తకూడదనే సదుద్దేశంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన కళ్యాణ లక్ష్మి పథకం పేదింటి ఆడబిడ్డల కుటుంబాలకు ఆర్థిక భరోసానిస్తుందని రాష్ట్ర ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. ఇల్లందకుంట మండలం సీతంపేట, రాచపల్లి, మల్లన్నపల్లి, గడ్డివానిపల్లి, చిన్న కోమటిపల్లి గ్రామాలతో పాటు జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని పలువురు లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి, ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను ఆయా లబ్ధిదారుల ఇండ్ల వద్దకు నేరుగా వెళ్లి అందజేశారు. లబ్ధిదారుల ఇళ్ల వద్దకు ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి వెళ్లిన సమయంలో లబ్ధిదారుల కుటుంబ సభ్యులు ఆయనకు నుదుట కుంకుమ తిలకం దిద్ది మంగళహారతులతో స్వాగతం పలికి శాలువాలతో ఘనంగా సన్మానించారు. కళ్యాణ లక్ష్మి చెక్కులతో పాటు తన వంతుగా ఒక చీరను కానుకగా ఇస్తుండడంతో లబ్ధిదారుల కుటుంబాల్లో ఆనందం వెల్లువిరిసింది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ… ముఖ్యమంత్రి కేసీఆర్ అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నారని అన్నారు.

- Advertisement -

ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశానికి ఆదర్శంగా నిలుస్తుండడం మనందరికీ గర్వకారణం అని అన్నారు. రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు ఏదో ఒక రూపంలో ప్రతి కుటుంబానికి చేరుతున్నాయని అన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఆరు నూరైనా 100కు పైగా స్థానాలలో బిఆర్ఎస్ పార్టీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. హుజురాబాద్ నియోజకవర్గంలో భారీ మెజార్టీతో గులాబీ జెండా ఎగరడం ఖాయమని, తాను ఎమ్మెల్యేగా గెలుపొందిన తర్వాత హుజురాబాద్ నియోజకవర్గాన్ని కనివిని ఎరుగని తీరుగా అభివృద్ధి పథంలో తీసుకెళ్తానని అన్నారు. రాష్ట్ర అభివృద్ధి సంక్షేమమే ధ్యేయంగా పని చేస్తున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రజలు ఎల్లవేళలా సహాయ సహకారాలు అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఇల్లందకుంట ఎంపీపీ సరిగొమ్ముల పావని వెంకటేష్, జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ తక్కల్లపల్లి రాజేశ్వరరావు, ఎంపీటీసీల ఫోరం మండలాధ్యక్షుడు మోటపోతుల ఐలయ్య, ఎంపీటీసీలు తెడ్ల ఓదెలు, ఎక్కటి సంజీవరెడ్డి, జమ్మికుంట పిఎసిఎస్ చైర్మన్ పొనగంటి సంపత్, జిల్లెల్ల తిరుపతిరెడ్డి, భూస అశోక్, రాచపల్లి అనిల్, మాడుగుల హరీష్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News