Thursday, April 10, 2025
HomeతెలంగాణPadi Kaushik: ప్రజల వద్దకే ప్రభుత్వ పథకాలు

Padi Kaushik: ప్రజల వద్దకే ప్రభుత్వ పథకాలు

వీణవంక మండల కేంద్రంలోని గ్రామాలలో కళ్యాణ లక్ష్మి, సిఎంఆర్ఎఫ్ రిలీఫ్ ఫండ్ చెక్కులను అందచేశారు ఎమ్మెల్సీ, ప్రభుత్వ విప్ పాడి కౌశిక్ రెడ్డి. గడప గడపకీ తిరుగుతూ ఆత్మీయంగా పలకరిస్తూ చెక్కులను ఇస్తూ, కష్ట సుఖాలను తెలుసుకుంటూ మీకు అండగా నేనున్నానంటూ, మన బలం బలగం మన కేసీఆర్ అని కౌశిక్ చెబుతున్నారు.

- Advertisement -

ఇటీవలే మరణించిన ముత్యాల సంపత్ కు సీఎంఆర్ రిలీఫ్ ఫండ్ చెక్కును అందిస్తూ మన కెసిఆర్ ప్రవేశపెట్టిన రైతు బీమా పథకం కింద ఐదు లక్షల రూపాయలు కూడా అందించారు కౌశిక్. వీరికి మొదటి దశలోనే ఇల్లు ఇప్పిస్తానని మాట ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో ఎంపీపీ ముసిపట్ల రేణుక తిరుపతిరెడ్డి, జడ్పిటిసి మాడ వనమాల సాధవరెడ్డి, పి ఎ సి ఎస్ విజయభాస్కర్ రెడ్డి, వైస్ ఎంపీపీ లతా శ్రీనివాస్, సర్పంచులు కొత్తిరెడ్డి కాంతారెడ్డి, పోధిల జ్యోతి రమేష్, సుజాత కిషన్ రెడ్డి, బండ సుజాత కిషన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News