Tuesday, October 8, 2024
HomeతెలంగాణKaushik Reddy: మీ కుటుంబ సభ్యుడిగా ఆదరించి ఒక్క అవకాశం ఇవ్వండి

Kaushik Reddy: మీ కుటుంబ సభ్యుడిగా ఆదరించి ఒక్క అవకాశం ఇవ్వండి

కని విని ఎరుగని రీతిలో అభివృద్ధి చేసి చూపిస్తా

ఈనెల 30న జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో హుజురాబాద్ నియోజకవర్గంలో బిఆర్ఎస్ పార్టీకి ఓటు వేసి గెలిపిస్తే ముఖ్యమంత్రి కేసీఆర్ సహకారంతో హుజురాబాద్ నియోజకవర్గాన్ని కనివిని ఎరుగని రీతిలో అభివృద్ధిని చేసి చూపిస్తానని, ఓటు బాధ్యత మీరు తీసుకుంటే అభివృద్ధి బాధ్యత నేను తీసుకుంటానని బిఆర్ఎస్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. ఇల్లందకుంట మండలం రాచపల్లి, మల్లన్నపల్లి, జమ్మికుంట మండలం శంభునిపల్లి, తనుగుల, గండ్రపల్లి, విలాసాగర్, జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని అమరవీరుల స్తూపం, అంబేద్కర్ కాలనీ, మారుతి నగర్, హుజురాబాద్ మున్సిపల్ పరిధిలోని రామ్ గోపాల్ రైస్ మిల్ ఏరియాలో సోమవారం ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు.

- Advertisement -

ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లోని ప్రధాన కూడళ్ల వద్ద ఏర్పాటు చేసిన సమావేశాలలో పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ… ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ కూడా ఈసారి హుజురాబాద్ లో బిఆర్ఎస్ ని గెలిపిస్తే హుజురాబాద్ అభివృద్ధి బాధ్యత తీసుకుంటానని అన్నారని అన్నారు. దేశంలోనే ఎక్కడలేని విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ 24 గంటల కరెంటుతో పాటు రైతులకు రుణమాఫీ చేసిన గొప్ప నాయకుడని అన్నారు.

ఇప్పటికే రూ,17 వేల కోట్లు రుణమాఫీ జరిగిందని ఇంకో రెండు వేల కోట్లు కూడా వారం పది రోజుల్లో అవుతుందని అన్నారు. ఎవరు అధైర్య పడద్దని రుణమాఫీ తప్పక ప్రతి ఒక్కరికి జరుగుతుందని ఆయన అన్నారు. బిఆర్ఎస్ అధినేత కేసిఆర్ మరోసారి పేద ప్రజల కోసం మేనిఫెస్టో రూపొందించారని, ఈ మేనిఫెస్టో పేదల కుటుంబాల్లో వెలుగులు నింపుతాయన్నారు. మేనిఫెస్టోలో సౌభాగ్య లక్ష్మి పథకం ద్వారా ప్రతి మహిళకు 3000 రూపాయలు అందించడంతోపాటు ఆరోగ్యశ్రీని 15 లక్షల పెంచుతామని అన్నారు. దీంతో పాటు ప్రతి కుటుంబానికి కెసిఆర్ బీమా ప్రతి ఇంటికి ధీమా అనే పథకంతో రూ,5 లక్షల ఉచిత బీమా అందిస్తూ గ్యాస్ సిలిండర్ ని కూడా 400 కి అందించనున్నామని అన్నారు. రైతుబంధును 16 వేలకు పెంచుతామన్నారు.

రేషన్ కార్డు ఉన్న ప్రతి ఇంటికి ఇకపై అన్నపూర్ణ పథకం ద్వారా సన్న బియ్యం అందజేస్తామన్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా మిగిలి ఉన్న రోడ్లతో పాటు కుల భవనాలు దేవాలయాలు కట్టిస్తానని హామీ ఇచ్చారు. ముచ్చటగా మూడోసారి ముఖ్యమంత్రి కేసీఆర్ అవుతున్నాడని ఇక్కడ వేరే వ్యక్తిని గెలిపించుకుంటే అభివృద్ధి జరుగుతుందా ఒకసారి ఆలోచించాలని అన్నారు. తనకు ఒక్క అవకాశం ఇచ్చి గెలిపిస్తే హుజురాబాద్ అభివృద్ధి అంటే ఎలా ఉంటుందో చూపిస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ సరిగొమ్ముల పావని వెంకటేష్, ఆయా గ్రామాల ప్రజా ప్రతినిధులు, బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు సంజీవరెడ్డి, అశోక్, మహేందర్, రాజు, తిరుపతిరెడ్డి, మొగిలి తదితరులు పాల్గొన్నారు.


✳️రాచపల్లిలో బిజెపి నుంచి బిఆర్ఎస్ లో చేరిన నాయకులు…
ఇల్లందకుంట మండలం రాచపల్లి గ్రామంలోని బిజెపి నాయకులు సోమవారం ప్రచార కార్యక్రమంలో భాగంగా కౌశిక్ రెడ్డి ఆధ్వర్యంలో బిఆర్ఎస్ పార్టీ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ… దేశంలో ఎక్కడి లేనివిధంగా తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు, తెలంగాణ అభివృద్ధిని చూసి ఆకర్షితులై బిఆర్ఎస్ లోకి వస్తున్నారని అన్నారు. బిఆర్ఎస్ పార్టీ తోనే రాష్ట్ర అభివృద్ధి ముడిపడి ఉందని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని అన్నారు.
✳️కుటుంబ విలువలు తెలిసిన వ్యక్తి కౌశిక్ రెడ్డి..

కౌశిక్ రెడ్డి సతీమణి షాలిని రెడ్డి…
హుజురాబాద్ నియోజకవర్గ బిఆర్ఎస్ అభ్యర్థి పాడి కౌశిక్ రెడ్డికి కుటుంబ విలువలు తెలుసని, నియోజకవర్గంలోని అందర్నీ కూడా తన కుటుంబ సభ్యులలానే భావిస్తారని కౌశిక్ రెడ్డి సతీమణి షాలిని రెడ్డి అన్నారు. ప్రతి ఒక్కరి సమస్యను తన సమస్య అనుకొని వారికి తనవంతు సహాయం చేసే వ్యక్తి కౌశిక్ రెడ్డి అని అన్నారు. కౌశిక్ రెడ్డికి ఒక్క అవకాశం కల్పించాలంటూ అభ్యర్థించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చే లా చూసే బాధ్యత నేను కూడా తీసుకుంటానని అన్నారు. 20 సంవత్సరాలు ఒకే వ్యక్తికి అవకాశం ఇచ్చారని ఈ ఒక్క సారి కౌశికి రెడ్డికి అవకాశం ఇవ్వాలని కోరారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News