ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి చేతుల మీదుగా బీఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు గౌడ కులస్తులు. హుజురాబాద్ నియోజకవర్గంలో గులాబీ హవా నడుస్తోంది. ఒక వైపు బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి, రాష్ట్ర ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి గ్రామాల్లో సుడిగాలి పర్యటనలు చేస్తూ ఒకసారి ఎమ్మెల్యేగా అవకాశం ఇవ్వండి అభివృద్ధి అంటే ఏంటో చేసి చూపిస్తానని ప్రచారం నిర్వహిస్తుండగా మరోవైపు గులాబీ పార్టీకి రాబోయే ఎన్నికల్లో ఏకగ్రీవంగా మద్దతు ఇస్తామంటూ పలు కుల సంఘాలు ముందుకు వస్తున్నాయి. జమ్మికుంట మండలం మడిపల్లి గ్రామ గౌడ కులస్తులు గౌడ సంఘం అధ్యక్షులు కొండపాక రమేష్ గౌడ్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి, ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి చేతుల మీదుగా గులాబీ తీర్థం పుచ్చుకున్నారు.
ఈ సందర్భంగా కౌశిక్ రెడ్డి గౌడ సంఘం నాయకులకు పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం గౌడ కులస్తులనుద్దేశించి రాష్ట్ర ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ… ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో సుపరిపాలన అందిస్తున్నారని అన్ని వర్గాల సంక్షేమానికి సమ ప్రాధాన్యత ఇస్తున్నారని అన్నారు. గౌడ కులస్తుల సంక్షేమానికి ప్రత్యేక దృష్టి సారించారని అందులో భాగంగానే గౌడ కులస్తులు తాటి, ఈత చెట్లకు పన్ను కట్టే విధానాన్ని రద్దు చేయడం జరిగిందని అన్నారు. నిరా పాలసీ విధానాన్ని తీసుకురావడం జరిగిందన్నారు. ప్రమాదవశాత్తు తాటి చెట్టు పైనుండి పడి మృతి చెందిన, అంగవైకల్యం చెందిన గీత కార్మికుల కుటుంబాలకు రూపాయలు ఐదు లక్షల ఎక్స్గ్రేషియా చెల్లించేందుకు ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకోవడం హర్షించదగిన విషయం అన్నారు. కులవృత్తులను ప్రోత్సహిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వాన్ని బలపరచాల్సిన అవసరం ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. రాష్ట్రంలో మళ్లీ అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ పార్టీనే నని, బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించి ముఖ్యమంత్రి కేసీఆర్ కు కానుకగా ఇద్దామని అన్నారు.
ఒకసారి తనకు అవకాశం కల్పించి ఎమ్మెల్యేగా గెలిపిస్తే అభివృద్ధి అంటే ఏంటో చేసి చూపిస్తానని ఈ సందర్భంగా చెప్పారు. గౌడ సంఘం అధ్యక్షులు కొండపాక రమేష్ గౌడ్ మాట్లాడుతూ… తమ సంపూర్ణ మద్దతు రాబోయే ఎన్నికల్లో బీ అర్ ఎస్ పార్టీ అభ్యర్థి కౌశిక్ రెడ్డి కే ఉంటుందని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం గౌడ కులస్తులకు అనుకూలంగా వ్యవహరిస్తుందని అన్నారు. సీఎం కేసీఆర్ కరెంటు కొరత లేకుండా చేశారని, రోడ్లు బాగు చేశారని, హుజురాబాద్ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు తీసుకువచ్చారని అన్నారు. హుజురాబాద్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి పాడి కౌశిక్ రెడ్డికి తాము ఏకగ్రీవ మద్దతు ప్రకటిస్తున్నట్లు తెలిపారు. కౌశిక్ రెడ్డి విజయానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తామని పునరుద్ఘాటించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ దేశంలోనే ఎక్కడ లేని విధంగా రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారని అన్నారు. అభివృద్ధి సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న బీఆర్ఎస్ ప్రభుత్వానికి తమ సంపూర్ణ మద్దతు ఎల్లప్పుడూ ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో జమ్మికుంట మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ పొల్నెని సత్యనారాయణ రావు, గౌడ సంఘం ఉపాధ్యక్షులు వొల్లాల చిరంజీవి, పబ్బు కృష్ణమూర్తి, పల్లెర్ల కొమురయ్య, మొగిలి, నాగపూరి సదానందం, తిరుపతి, రాజు, మాచర్ల నాగేష్, సదానందం, బొనగాని రమేష్, తిరుపతి, కొండపాక సదానందం, రామకృష్ణ, సోమారపు రాజు తదితరులు పాల్గొన్నారు.