Sunday, October 6, 2024
HomeతెలంగాణPadi Kaushik: సంక్షేమ పథకాల అమల్లో మనమే ఆదర్శం

Padi Kaushik: సంక్షేమ పథకాల అమల్లో మనమే ఆదర్శం

తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని, ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుచూపు ఉన్న నాయకుడని రాష్ట్ర ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ పార్టీ హుజరాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. హుజురాబాద్ మండలం కందుగుల గ్రామంలో 21 లక్షలతో నిర్మాణం చేపట్టిన గ్రామపంచాయతీ కార్యాలయాన్ని ప్రారంభించారు. 20 లక్షలతో నిర్మాణం చేపట్టనున్న మహిళా సంఘ భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందు రాష్ట్ర ఏర్పాటు తర్వాత అభివృద్ధిలో ఎంతో మార్పు ఉందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అహర్నిశలు రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసమే ఆలోచిస్తున్నట్లు చెప్పారు. గ్రామీణ ప్రాంతాలు ప్రత్యేక రాష్ట్రంలో అభివృద్ధి పథంలో పయనిస్తున్నాయని, గత ప్రభుత్వాలు విస్మరించిన అభివృద్ధిని ముఖ్యమంత్రి కేసీఆర్ చేసి చూపించడం తెలంగాణ రాష్ట్రానికే గర్వకారణం అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో ని మహిళా సంఘాల ఆర్థిక అభ్యున్నతి పై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు చెప్పారు. అందులో భాగంగానే ప్రతి గ్రామంలో మహిళా సంఘ భవనాల నిర్మాణానికి శ్రీకారం చుట్టడం జరిగిందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ఏదో ఒక రూపంలో రాష్ట్రంలోని ప్రతి ఇంటికి చేరుతున్నాయన్నారు. సంక్షేమం, అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్న బీఆర్ఎస్ ప్రభుత్వానికి నియోజకవర్గ ప్రజలు సంపూర్ణ మద్దతు తెలపాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్, బెళ్లి రాజయ్య, మండల పరిధిలోని ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News