Friday, September 20, 2024
HomeతెలంగాణPadi Kaushik: అభివృద్ధి, సంక్షేమమే కేసీఆర్ లక్ష్యం

Padi Kaushik: అభివృద్ధి, సంక్షేమమే కేసీఆర్ లక్ష్యం

ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు తరువాత ముఖ్యమంత్రి కేసీఆర్ అభివృద్ధి సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్నారని, రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని రాష్ట్ర ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ పార్టీ హుజురాబాద్ నియోజకవర్గ ఇంచార్జ్ పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. హుజురాబాద్ మండలం చెల్పూర్ లో రూ,68 లక్షలతో చేపడుతున్న పలు అభివృద్ధి పనులకు శనివారం ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ గ్రామాలు అభివృద్ధి పథంలో పయనించినప్పుడే గాంధీజీ కలలుగన్న స్వరాజ్యం సహకారం అవుతుందని ఆ దిశలోనే ముఖ్యమంత్రి కేసీఆర్ పల్లెలే దేశానికి పట్టుకొమ్మలుగా భావించి పల్లెల్లో మౌలిక వసతుల కల్పనపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందు గ్రామీణ ప్రాంతాల్లో రూ,10 లక్షలతో ఒక అభివృద్ధి పని మంజూరు అయిందంటే ఎంతో గొప్పగా భావించే వారని కానీ నేడు ప్రత్యేక రాష్ట్రంలో కోట్ల రూపాయలతో పలు అభివృద్ధి పనులు చేపట్టుకోవడం జరుగుతుందన్నారు. ఇదంతా ముఖ్యమంత్రి కేసీఆర్ అంకుఠిత దీక్ష, ప్రత్యేక రాష్ట్ర సాధన తోనే సాధ్యమవుతుందన్నారు. యాదవ కమ్యూనిటీ హాల్ కోసం రూ,పది లక్షల నిధులతో భూమి పూజ చేసుకోవడంతో యాదవ కుటుంబాలలో ఆనందం వెల్లువిరుస్తుందన్నారు. రూ, 33 లక్షలతో కుమ్మరి గండి మురికి కాలువ పనులకు శంకుస్థాపన చేయడం జరిగిందన్నారు. రూ,15 లక్షలతో వాగు దగ్గర స్మశాన వాటిక నిర్మాణ పనులకు, రూ,10 లక్షలు నిధులతో బస్టాండ్ దగ్గర స్మశాన వాటిక నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయడం జరిగిందన్నారు. గ్రామాల్లో మౌలిక వసతులు కల్పిస్తున్న బీఆర్ఎస్ ప్రభుత్వానికి గ్రామస్తులందరూ ఎల్లవేళలా సంపూర్ణ మద్దతు తెలియజేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్, స్థానిక ప్రజాప్రతినిధులు, కుల సంఘాల నాయకులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News