Thursday, July 4, 2024
HomeతెలంగాణPadmarao: వర్షాల వల్ల ఇబ్బందులు లేకుండా చర్యలు

Padmarao: వర్షాల వల్ల ఇబ్బందులు లేకుండా చర్యలు

సికింద్రాబాద్ లో వరద పరిస్థితిపై సమీక్ష

సికింద్రాబాద్ పరిధిలో తాజా వర్షాల వల్ల ప్రజలు ఇబ్బంది పడకుండా అన్ని జాగ్రత్తలు పాటిస్తున్నామని డిప్యూటీ స్పీకర్ తీగుల్ల పద్మారావు అన్నారు. భారీ వర్షాల నేపధ్యంలో డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ సితాఫలమండీ లోని ఎం. ఎల్. ఏ. క్యాంపు కార్యాలయంలో ప్రజాప్రతినిధులు, అధికారులతో ఓ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పద్మారావు గౌడ్ మాట్లాడుతూ సికింద్రాబాద్ నియోజకవర్గంలో లాలాపేట, లక్ష్మి నగర్, చిలకలగుడా, మొహమ్మద్ గుడా, ఇందిరానగర్ కాలనీ, కౌసర్ మస్జిద్, అంబర్ నగర్ , ఫ్రైడే మార్కెట్, షాబాజ్ గుడా ప్రాంతాల్లో నాలా ల వద్ద కల్వర్టుల పునర్నిర్మాణం, నాలా విస్తరణ పనులను గడచిన ఏడేళ్ళ కాలంలో పూర్తి చేశామని, ఫలితంగా బస్తీలు ముంపునకు గురయ్యే పరిస్థితి తొలగిపోయిందని తెలిపారు. తాజాగా అడ్డగుట్ట లో వరద నీటి కాలువల పునర్నిర్మాణానికి రూ.67 లక్షలు, తార్నాకకు రూ.కోటీ పడి లక్షలు, మేట్టుగుడా కు రూ.57 లక్షలు, బౌద్దనగర్ కు రూ.నాలుగున్నార కోట్ల మేరకు నిధులను మంజూరు చేశామని, దాదాపు రూ.ఏడున్నర కోట్ల ఖర్చుతో చేపట్టిన ఈ పనులు త్వరలో ప్రారంభిస్తామని తెలిపారు. జీ హెచ్ ఎం సీ డిప్యూటీ కమీషనర్ సుధాంశు, జలమండలి డీ జీ ఎం లు వై. కృష్ణ, సరిత, విద్యుత్ ఏ డీ ఈ మహేష్, కార్పొరేటర్లు సామల హేమ, రాసురి సునీత, కంది శైలజ, లింగాని ప్రసన్న లక్ష్మి శ్రీనివాస్ లతో పాటు అధికారులు, నేతలు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News