Sunday, November 16, 2025
HomeTop StoriesPaddy farmers: అన్నదాతలకు గుబులు పుట్టిస్తున్న మొగులు.. ఆందోళనలో రైతన్నలు!

Paddy farmers: అన్నదాతలకు గుబులు పుట్టిస్తున్న మొగులు.. ఆందోళనలో రైతన్నలు!

Paddy procurement issue: రాష్ట్రంలో అన్నదాతల పరిస్థితి అయోమయంగా ఉంది. ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని అమ్ముకోవడానికి కొనుగోలు కేంద్రాలు లేక రోడ్లపై ధాన్యం పోసి.. కొనుగోలు కేంద్రాల కోసం రైతులు ఎదురుచూస్తున్నారు. వరి కోతలు ప్రారంభమై ధాన్యం విక్రయించేందుకు సిద్ధంగా ఉన్నప్పటికీ.. కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైతులు పంటలను కోసి ధాన్యాన్ని ఆరబెట్టి కొనుగోలు కేంద్రాల కోసం ఎదురుచూపులు చుస్తున్నారు. అంతేకాకుండా రైతుల గుండెల్లో మొగులు గుబులు పుట్టిస్తుంది. ఎప్పుడు వర్షం వస్తుందో తెలియక అయోమయ స్థితిలో అన్నదాతలు ఉన్నారు. వరుణుడు ఆగ్రహిస్తే చేతికి అందిన వంట నేలపాలవుతుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -

సకాలంలో ప్రారంభించాలని కోరుతున్న రైతులు: 15 రోజుల క్రితమే వరికోత కోసి దాన్ని.. ఆరబెట్టి అమ్ముకునేందుకు సిద్ధంగా ఉన్న ధాన్యం కొనుగోలు కేంద్రాల జాడలేదని కరీంనగర్ జిల్లా రైతులు వాపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి వెంటనే ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. సైదాపూర్ మండలంలో ఖరీఫ్ సీజన్లో 15వేల ఎకరాల్లో వరి సాగు చేయగా 36.00 మెట్రిక్ టన్నుల ధాన్యం వస్తుందని వ్యవసాయ అధికారులు అంచనా వేశారు. సైదాపూర్ మండలంలోని ఐకేపీ ద్వారా 11 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. అంతే కాకుండా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ద్వారా 4 కొనుగోలు కేంద్రాలు, విశాల పరపతి సహకార సంఘం ద్వారా 12 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్టుగా అధికారులు తెలిపారు. అయితే ఈ కొనుగోలు కేంద్రాలను సకాలంలో ప్రారంభిస్తే అన్నదాతలకు ఇబ్బందులు తగ్గుతాయని స్థానికరైతులు కోరుతున్నారు.

Also Read:https://teluguprabha.net/telangana-news/heavy-rains-forecast-updates-for-telangana/

మొగులు గుబులు పుట్టిస్తుంది: కష్టపడి పండించిన ధాన్యం అమ్మడుపోయి.. డబ్బులు చేతికి వచ్చేవరకు ఆందోళనగానే ఉంటుందని రైతులు తెలిపారు. వర్షాలు పడితే ధాన్యం తడిసి ముద్దయ్యే పరిస్థితి నెలకుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని కోరారు. వాతావరణంలో మార్పులు చోటుచేసుకోవడంతో ఏర్పడిన మొగులు గుబులు పుట్టిస్తోందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

తడిసిన వడ్లను ఆంక్షలు లేకుండా కొనాలి: తడిసిన వడ్లను ఆంక్షలు లేకుండా కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. రైతుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరారు. కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని ప్రభుత్వాన్ని రైతులు వేడుకుంటున్నరు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad