Sunday, November 16, 2025
HomeతెలంగాణPailla: ఘనంగా BRS ఆత్మీయ సమ్మేళనం

Pailla: ఘనంగా BRS ఆత్మీయ సమ్మేళనం

భువనగిరి ఎమ్మెల్యే ఫైళ్ల శేఖర్ రెడ్డి బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. మండలంలోని టేకుల సోమారం గ్రామంలో ఎంఎంఎస్ గార్డెన్ లో ఆరు ఎంపిటిసిల పరిధి గ్రామాల కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనం బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు తుమ్మల వెంకట్ రెడ్డి అధ్యక్షతన ఈ కార్యక్రమం జరిగింది. గ్రామాలలో గ్రూపులు రాజకీయాలు విడనాడి అందరూ కలిసికట్టుగా పనిచేసి పార్టీ కోసం కృషి చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు మొగిళ్ల శ్రీనివాస్, సింగిల్ విండో చైర్మన్ సురకంటి వెంకట్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ కూనపురి కవిత, రైతు కోఆర్డినేటర్ పడమటి మమతారెడ్డి, శ్రీరాముల నాగరాజు, గూడూరు శ్రీధర్ రెడ్డి, రేపాక ప్రదీప్ రెడ్డి, గుర్రం లక్ష్మారెడ్డి, డేగల పాండు, మద్దెల మంజుల, ఎమ్మె లింగస్వామి, సర్పంచులు ఎంపీటీసీలు గ్రామ శాఖ అధ్యక్షులు కార్యకర్తలు నాయకులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad