Thursday, September 19, 2024
HomeతెలంగాణPailla: జులూరులో పర్యటించిన ఎమ్మెల్యే

Pailla: జులూరులో పర్యటించిన ఎమ్మెల్యే

అభివృద్ధి కార్యక్రమాల్లో ఎమ్మెల్యే బిజీ

భువనగిరి శాసనసభ్యులు ఫైళ్ల శేఖర్ రెడ్డి భూదాన్ పోచంపల్లి మండలం జులూరు గ్రామంలో పర్యటించారు. గ్రామ పంచాయితీ పరిధిలోని అలినగర్ లో యాదవ సంఘం కమ్యూనిటీ భవనానికి శంకుస్థాపన చేశారు. అనంతరం జూలూరు గ్రామంలో పర్యటించి ఫైళ్ల ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఫూరిఫైడ్ వాటర్ ప్లాంట్ ని ప్రారంభించారు. గ్రామ ప్రజలతో మమేకమై వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రజక సంఘం, కురుమ సంఘాల భవనాల పునరుద్ధరణకు ఆమోదం తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మాడుగుల ప్రభాకర్ రెడ్డి, జెడ్పిటిసి కోట పుష్పలత మల్లారెడ్డి, పిఎసిఎస్ చైర్మన్ కందాడి భూపాల్ రెడ్డి, గ్రామ సర్పంచ్ యాకారి రేణుక నర్సింగ్, బిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు పాటి సుధాకర్ రెడ్డి బిఆర్ఎస్ పార్టీ మండల సీనియర్ నాయకులు ఐతరాజు బిక్షపతి, నోముల ఉపేందర్ రెడ్డి, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News