గ్రామాల సర్వతోముఖాభివృద్ధికి బీఆర్ఎస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని భువనగిరి శాసన సభ్యులు ఫైళ్ల శేఖర్ రెడ్డి అన్నారు. మండలంలోని దాసిరెడ్డిగూడెం గ్రామంలో ఎస్సీ కమిటీ హాల్ కు శంకుస్థాపన, సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహానికి పూలమాల వేసి, అనంతరం నూతన గ్రామ పంచాయతీ భవనం ప్రారంభించారు. నాతాళ్లగూడెం గ్రామంలో సిసి రోడ్లను పరిశీలించి నూతన గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రారంభించి సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దేశంలోనే ఏ రాష్ట్రంలో లేని అభివృద్ధి సంక్షేమ పథకాలు రాష్ట్రంలో పేదలకు అందజేస్తున్నామన్నారు. గ్రామాలను అన్ని మౌలిక వసతులతో అభివృద్ధి పర్చడమే ధ్యేయంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఆయన అన్నారు.
ఈ కార్యక్రమంలో ఎంపీపీ నూతి రమేష్ రాజు, సర్పంచులు కొమురెల్లి సరిత సంజీవరెడ్డి, ఉలిపే మల్లేశం, జెడ్పిటిసి వాకిటి పద్మ అనంతరెడ్డి బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఫైళ్ల రాజవర్ధన్ రెడ్డి ఎంపీటీసీలు మోటే నరసింహ నోముల మల్లేష్ యాదవ్ ఎంపీడీవో లెంకల గీతారెడ్డి మండల అధ్యక్షులు తుమ్మల వెంకట్ రెడ్డి నాయకులు ముద్దసాని కిరణ్ రెడ్డి కీసర్ల సత్తిరెడ్డి పిఆర్ ఏఈ సుగుణాకర్ రావు, బందారపు లింగస్వామి దంతూరి సత్తయ్య,బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు ఎమ్మే లింగస్వామి బాలేశ్వర్ ఉపసర్పంచ్ రాపోలు రజిత గోపి వార్డు మెంబర్లు కునపూరి శ్రీశైలం దంతూరి నరేష్ కుమార్ శ్యామల సాలమ్మ దంతూరి శిరీష రాపోలు రవిశంకర్ నరేందర్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.