చేనేత కార్మికుల సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ‘చేనేత అభయహస్తం’ పథకాన్ని తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ పథకం కింద నేతన్నల సంక్షేమానికి ప్రభుత్వం రూ.168 కోట్లు కేటాయించింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం నిర్ణయంపై చేనే కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే హన్మకొండ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.
ఈ సందర్భంగా కార్మికులు మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఎంతో మంది నేత కార్మికులకు మేలు జరుగుతుందన్నారు. చేనేత కార్మికుల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం మూడు పథకాలను అమలు చేయడం సంతోషంగా ఉందని వెల్లడించారు. కాగా చేనేత అభయ హస్తం పథకంలో భాగంగా నేతన్న పొదుపు నిధికి రూ.115కోట్లు, నేతన్న భద్రతకు రూ.9కోట్లు, నేతన్న భరోసాకు రూ.44కోట్లను ప్రభుత్వం కేటాయించింది.