Friday, September 20, 2024
HomeతెలంగాణPalakurthi: గీతన్న కుటుంబాన్ని ఆదుకోవాలి

Palakurthi: గీతన్న కుటుంబాన్ని ఆదుకోవాలి

5 లక్షల ఎక్స్ గ్రేషియా డిమాండ్

పాలకుర్తి మండలం వాల్మీడీ గ్రామం కూటికంటి సతీష్ గౌడ్ కులవృత్తిలో భాగంగా ఉదయం సుమారు 10 గంటల ప్రాంతంలో తాటి చెట్టు ఎక్కి కల్లు తీస్తుండగా, కాలుజారి కింద పడ్డాడు. అక్కడే ఉన్న కొందరు స్థానికులు తీవ్ర గాయాలైన సతీష్ గౌడ్ ను హుటాహుటిన పాలకుర్తిలో ప్రైవేటు హాస్పిటల్కు తరలించారు. అక్కడి డాక్టర్స్ వెన్నముకకు తీవ్ర గాయాలయ్యాయని, మెరుగైన వైద్యం కోసం ఎంజీఎం హాస్పిటల్ వరంగల్ కు రెఫర్ చేశారు. గౌడన్న కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకొని తక్షణమే ఐదు లక్షల ఎక్స్గ్రేషియా అందజేయాలని గౌడ జన హక్కుల పోరాట సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మూల వెంకటేశ్వర్లు గౌడ్ ప్రభుత్వానికి అందించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో గౌడ జన హక్కుల పోరాట సమితి జనగామ జిల్లా అధ్యక్షులు తాళ్ల సోమనారాయణ గౌడ్ రాష్ట్ర కార్యదర్శులు కమ్మగాని పరమేశ్వర్ గౌడ్ గిరగాని సమ్మయ్య గౌడ్ పాలకుర్తి మండల అధ్యక్షుడు పొడిశెట్టి వెంకన్న గౌడ్ చెరుకు రాములు గౌడ్ వాల్మీడీ గ్రామ సొసైటీ అధ్యక్షులు రామాంజనేయులు గౌడ్ గౌడ నాయకులు చెరుకు ప్రభాకర్ గౌడ్ కోటిగంటి రమేష్ గౌడ్ నరేందర్ గౌడ్ పరశురాములు గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News