Saturday, November 23, 2024
HomeతెలంగాణPalakurthi: నేషన్స్ ఫస్ట్ హ్యూమన్ చైన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పాలిటెక్నిక్ పుస్తకాల పంపిణి

Palakurthi: నేషన్స్ ఫస్ట్ హ్యూమన్ చైన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పాలిటెక్నిక్ పుస్తకాల పంపిణి

పాలకుర్తి మండలంలోని వావిలాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో, నేషన్స్ ఫస్ట్ హ్యూమన్ చైన్ ఫౌండేషన్- మిషన్ విద్య విజ్ఞాన్ ప్రాజెక్ట్ సేవలో భాగంగా, పాలిటెక్నిక్ పుస్తకాల పంపిణి, ఫౌండేషన్ ప్రభుత్వ పాఠశాల అభివృద్ధి సేవ కార్యక్రమాల అవగాహన కార్యక్రమం పాఠశాల ఎన్.ఎఫ్.హెచ్.సి ఫౌండేషన్-మిషన్ విద్య విజ్ఞాన్ సేవ కార్యక్రమం నిర్వహించారు.

- Advertisement -

విద్యా శాఖ నోడల్ ఆఫీసర్, ప్రధానోపాధ్యాయుడు పోతుగంటి నర్సయ్య మాట్లాడుతూ, కృషి, పట్టుదలతో శ్రమించి ఫౌండేషన్ వ్యవస్థాపకులు ముడావత్ మోహన్, సీనియర్ రీసెర్చ్ ఇంజనీర్, ఎన్ఐటి వరంగల్ పూర్వ విద్యార్థి మరియు ఫౌండేషన్ తెలంగాణ ఎగ్జిక్యూటివ్ ఇస్లావత్ సుమన్ సూచన మరియు దాత సురేష్ బిజ్జం బెంగళూరు సహకారం మేరకు ఇచ్చిన పుస్తకాలను సద్వినియోగం చేసుకోవాలని, అలాగే భవిష్యత్తులో కూడా ఫౌండేషన్ పాఠశాల లైబ్రరీ, ఎన్.ఎమ్.ఎమ్.ఎస్. స్కాలర్షిప్, పాలిటెక్నిక్, కౌన్సిలింగ్, కెరీర్ గైడెన్స్, ఐఐటి జెఇఇ ఫౌండేషన్ ఎన్నో సేవ కార్యక్రమాలకు కావాల్సిన సహకారం ఫౌండేషన్ అందిస్తుందని నర్సయ్య తెలియజేసారు.

ఫౌండేషన్ విద్యార్థులకు ఎప్పుడూ చేయూతగా ఉంటుంది అని, ఎప్పుడు ఎలాంటి సహకారం కావాలన్నా తమ ఫౌండేషన్ నెంబర్ 78927 82387 ని సంప్రదించవచ్చు అని ఫీజికల్ ఎడ్యుకేషన్ టీచర్ రజిత తెలియజేసారు. ఫౌండేషన్ సేవ కార్యక్రమాలను రజిత కోఆర్డినేట్ చేస్తున్నారు.

ఈ కార్యక్రమంలో సిఎమ్ఓ నర్సింహారావు, ఉపాధ్యాయులు సురేందర్ రెడ్డి, రంగచారి, సోమనినాయక్, కొండయ్య, సధానందం, సోమ మల్లయ్య, ఏఏపిసి ఛైర్పర్సన్ కొనుకటి రాణి, పిఇటి రజిత, విద్యార్థులు, వారి తల్లితండ్రులు తదితరులు పాల్గొన్నారు

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News