Friday, September 20, 2024
HomeతెలంగాణPalakurthi: పెద్దమ్మ తల్లి గుడికి 5 లక్షలు మంజూరు

Palakurthi: పెద్దమ్మ తల్లి గుడికి 5 లక్షలు మంజూరు

అవుతాపురం గ్రామంలోని పెద్దమ్మ తల్లి గుడికి 5 లక్షల రూపాయలు మంజూరు చేశారు మంత్రి ఎర్రబెల్లి. మహబూబాబాద్ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం పెద్ద వంగర మండలం అవుతాపురం గ్రామంలో పెద్దమ్మ తల్లి గుడికి రూ.5లక్షలు మంజూరు చేస్తున్నట్లు రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రకటించారు. ఆ గ్రామానికి చెందిన ముదిరాజ్ సంఘం సభ్యులు పర్వతగిరిలో మంత్రిని కలిశారు. ఈ సందర్భంగా తమ కుల దైవం పెద్దమ్మతల్లి ఆలయ నిర్మాణానికి నిధులు కావాలని కోరగా మంత్రి ఎర్రబెల్లి ఇందుకు సానుకూలంగా స్పందించారు. ఆ గ్రామంలో పెద్దమ్మ తల్లి ఆలయ నిర్మాణానికి 5 లక్షలు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో ముదిరాజ్ సంఘం సభ్యులు మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News