Monday, March 24, 2025
HomeతెలంగాణPalakurthi: ముగిసిన శివరాత్రి బ్రహ్మోత్సవాలు

Palakurthi: ముగిసిన శివరాత్రి బ్రహ్మోత్సవాలు

అగ్నిగుండాలతో ముగిసిన ఉత్సవాలు

మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా పాలకుర్తి శ్రీ సోమేశ్వర లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో 5వ రోజు అగ్నిగుండాలు, పూర్ణాహుతి కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమాలతో మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు ముగిసాయి. ఈ కార్యక్రమానికి ఉత్సవ కమిటీ సభ్యులు,ఈవో హాజరైఉదయం భక్తులు అగ్నిగుండాలు తొక్కడనికి తండోపతండాలుగా తరలివచ్చారు. అనంతరం స్వామివారికి మహా అన్నపూజ కార్యక్రమం పూర్ణాహుతి కార్యక్రమం తో శివరాత్రి బ్రహ్మోత్సవాలు ముగుసాయని ఆలయ ఈవో లక్ష్మీ ప్రసన్న తెలిపారు.

- Advertisement -

కార్యక్రమంలో ఉత్సవ కమిటీ సభ్యులు కృష్ణమాచార్యులు, బోనగిరి సాగర్, పన్నీర్ వెంకన్న ,మాదాసు హరీష్ కమిటీ సభ్యులు, ఈవో భాగం లక్ష్మీప్రసన్న, సూపరింటెండెంట్ వెంకటయ్య, ప్రధాన అర్చకులు దేవగిరి లక్ష్మన్న, దేవగిరి రమేష్, ముత్తగజం నాగరాజు, దేవగిరి అనిల్, తదితర అర్చకులు దేవాలయ సిబ్బంది పాల్గొన్నారు.

కార్యక్రమంలో భక్తులకు ఎలాంటి అవార్చన ఘటనలు జరగకుండా పోలీసు సిబ్బంది సిఐ మహేందర్ రెడ్డి , ఎస్సై సాయి ప్రసన్న కుమార్, ఆధ్వర్యంలో బందోబస్తు నిర్వహించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News