Sunday, October 6, 2024
HomeతెలంగాణPalakurthi: ఎర్రబెల్లికి పెరుగుతున్న మద్దతు

Palakurthi: ఎర్రబెల్లికి పెరుగుతున్న మద్దతు

బిఅర్ఎస్ లో పోటెత్తిన చేరికలు

పాలకుర్తి నియోజకవర్గ బిఅర్ఎస్ అభ్యర్ధి, మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుకి ప్రజల మద్దతు రోజు రోజుకూ పెరుగుతున్నది. వివిధ వర్గాలు, సామాజిక సంఘాలు, ఆయనకు మద్దతుగా నిలుస్తున్నాయి. వివిధ పార్టీలు, సామాజిక వర్గాలకు చెందిన అనేక మంది బి అర్ ఎస్ లో చేరితుండగా, మరికొందరు తమ మద్దతు తెలుపుతూ మంత్రిని కలుస్తున్నారు. తాజాగా కొడకండ్ల మండలం రామన్నగూడెంకి చెందిన శ్రీ కృష్ణ గొర్రెల పెంపకం దారుల సంఘంకు చెందిన 41 కుటుంబాల యాదవ సంఘం కార్యవర్గం, సభ్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు కి మద్దతు తెలిపారు.

- Advertisement -

పాలకుర్తికి చెందిన మాదిగ సామాజిక వర్గ నాయకుడు ఎడవల్లి పెద్ద సోమయ్య మంత్రి ఎర్రబెల్లిని పాలకుర్తి బిఅర్ఎస్ పార్టీ కార్యాలయంలో కలిసి పార్టీలో చేరారు. పాలకుర్తి మండల బీజేపీ యూత్ అధ్యక్షుడు, రాఘవాపురం గ్రామానికి చెందిన పూజారి మహేష్ మంత్రి దయన్న సమక్షంలో బి అర్ ఎస్ లో చేరారు. రాయపర్తి మండలం కొలన్ పల్లికి చెందిన వివిధ పార్టీలకు చెందిన అనేకమంది యువకులు మంత్రి ఎర్రబెల్లి ని పాలకుర్తిలో కలిసి తమ మద్దతు తెలిపారు. పాలకుర్తి మండలం తొర్రూరు గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు పసులాది యాకస్వామి, పసులాది ఆంజనేయులు, రేగుల రాములు ముదిరాజ్ తదితరులు బి ర్ఎస్ లో చేరారు.

పాలకుర్తి మండలం చెన్నూరు గ్రామంలోని కాంగ్రెస్ నాయకులు పిట్టల పెద్ద కొండయ్య, పండుగ నర్సయ్య లు బి అర్ ఎస్ లో చేరారు. మండల కేంద్రమైన పెద్ద వంగర కు చెందిన పలువురు మహిళలు కలిసి వచ్చి, మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావును కలిసి తమ సంపూర్ణ మద్దతు తెలిపారు. కొద్దిసేపు మంత్రితో కలిసి వాళ్లంతా గ్రామాల్లోని తాజా పరిస్థితులను వివరించారు. రోజురోజుకు మంత్రికి, బి అర్ ఎస్ పార్టీకి మద్దతు పెరుగుతున్నది అన్నారు. ప్రత్యేకించి మహిళలు అంతా మంత్రికి అండగా ఉన్నామని తెలిపారు. ఈ వేర్వేరు సందర్భాలలో వారిని ఉద్దేశించి మంత్రి మాట్లాడారు.

ప్రజలు తమకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండే నాయకుడిని ఎన్నుకోవాలని చెప్పారు. ఇలా వచ్చి అలా వెళ్ళే వాళ్ళతో ఏమీ ఒరగదని తెలిపారు. బిఅర్ఎస్ అంటేనే ఇంటి పార్టీ, నేను మీ కుటుంబ సభ్యుడిని, మీ కష్ట సుఖాల్లో పాలు పంచుకునే వాడిని, మీకు అన్ని విధాలుగా అందుబాటులో ఉంటాను అని మంత్రి అనారు. మీరంతా మిగతా ప్రజల మద్దతు కూడగట్టాలని కోరారు. ఈ ఎన్నికల్లో తమకు మద్దతుగా నిలవాలని చెప్పారు. అందుకు వాళ్లంతా మంత్రికే ఈ ఎన్నికల్లో ఓటు వేసి గెలిపిస్తమని హామీ ఇచ్చారు. ఆయా కార్యక్రమాల్లో స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నేతలు, ముఖ్య కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News