Friday, September 20, 2024
HomeతెలంగాణPuja: పాలకుర్తిలో పూజలు చేసిన ఎర్రబెల్లి దంపతులు

Puja: పాలకుర్తిలో పూజలు చేసిన ఎర్రబెల్లి దంపతులు

ప్రముఖ పవిత్ర క్షేత్రం పాలకుర్తిలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఆయన సతీమణి ఉషా దయాకర్ రావు గారు శ్రీశ్రీశ్రీ చండికా అమ్మవారి ప్రతిష్టలో భాగంగా జరిగిన గణపతి పూజ, పుణ్య వచనం పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ నెల 18వ తేదీన పాలకుర్తి శ్రీ సోమేశ్వర లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో ఘనంగా మహా శివరాత్రి పర్వదినం నిర్వహిస్తున్న సందర్భంగా ఈ నెల 16వ తేదీన చండిక అమ్మవారి ప్రతిష్ట, రుద్రహోమ సహిత శత చండీ హోమం మహోత్సవం జరుగనుంది. దీనిలో భాగంగా నేడు ప్రతిష్ట మహోత్సవం కోసం చేసిన గణపతి పూజ, పుణ్య వచనం కార్యక్రమంలో మంత్రి దంపతులు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News