Monday, September 16, 2024
HomeతెలంగాణPalakurthi: పాలకుర్తిలో యశస్విని రెడ్డి నామినేషన్

Palakurthi: పాలకుర్తిలో యశస్విని రెడ్డి నామినేషన్

ఎమ్మెల్యేగా గెలిస్తే నా జీతం కూడా ఈ ప్రాంత అభివృద్ధికే

పాలకుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మామిడాల యశస్విని రెడ్డి పాలకుర్తి మండల కేంద్రంలో ఉన్న స్వయంభూ శ్రీ సోమేశ్వర లక్ష్మి నరసింహ స్వామీ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో భారీ ర్యాలీగా వెళ్లి తహశీల్దార్ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేసిన అనంతరం పాలకుర్తి మండల కేంద్రంలో నిర్వహించిన చాకలి ఐలమ్మ సభా ప్రాంగణానికి తరలి వెళ్ళారు. ముఖ్య అతిథిగా టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సభా ప్రాంగణానికి చేరుకోగా ఒక్కసారే అభిమానుల కేరింతలతో సభా ప్రాంగణంలో సిఎం..సిఎం.. అనే నినాదాలు మరుమోగాయి.

- Advertisement -

ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ గత 40 సంవత్సరాలుగా రాజకీయాలకు సంబంధం లేకుండా ఈ ప్రాంత ప్రజల కష్టాలను తీర్చడానికి ఝాన్సీ రాజేందర్ రెడ్డి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారని.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పుడు మిగులు బడ్జెట్ తో, ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిన ఘనత కెసిఆర్ కుటుంబానిదని..
రేషన్ షాప్ డీలర్ గా ఉన్న దయాకర్ రావు, అధికార దుర్వినియోగానికి పాల్పడి వేల ఎకరాల భూమిని, కోట్ల రూపాయల ప్రజాధనాన్ని తన సొంత ఖాతాలో వేసుకున్నాడు తప్పితే పాలకుర్తి నియోజకవర్గనికి చేసింది ఏమీ లేదని, పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్న దయాకర్ రావు పేరుకి మంత్రి తప్ప నియోజకవర్గంలో ఒక డబల్ బెడ్ రూమ్ ఇండ్లు కానీ, మహిళా సాధికారత కోసం ఎలాంటి కార్యక్రమాలు కానీ, నిరుద్యోగ యువత కోసం, చదువుకునే విద్యార్థుల కోసం, రైతన్నల కోసం ఎలాంటి అభివృద్ధి కార్యక్రమం చేపట్టలేదని..ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టకపోగా ఎన్నికల ముందు దళిత బంధు, బీసీ బంధు, గృహలక్ష్మి అంటూ మోసపూరిత హామిలతో ఓట్లు వేయించుకునే పనులు దయాకర్ రావు చేస్తున్నాడని ఆరోపించారు.


కొత్త సంవత్సరం, కొత్త ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కర్ణాటక రాష్ట్రంలో లాగా ఆరు గ్యారెంటీ కార్డులను వెంటనే అమల్లోకి తీసుకొస్తానని.. కాంగ్రెస్ పార్టీ చెప్పింది అంటే, కచ్చితంగా చేసి తీరుతుందని..అందుకు నిదర్శనం ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఇవ్వడంమని అన్నారు.


కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి యశస్వి రెడ్డి మాట్లాడుతూ ఎర్రబెల్లి దోచుకోవడం దాచుకోవడం తప్ప పాలకుర్తికి చేసిన అభివృద్ధి ఏమీ లేదని అన్నారు. చైతన్యవంతమైన పాలకుర్తి గడ్డ ప్రజలు దయాకోర్ దయాకర్ రావును పర్వతగిరికి పంపడం ఖాయమని హెచ్చరించారు. తనకు వచ్చే ఎమ్మెల్యే జీతం సైతం ప్రజాసేవకే ఉపయోగిస్తానని స్పష్టం చేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News